ఆర్‌కాంకు భారీ ఉపశమనం

RCom gains on real estate assets sale buzz  - Sakshi

సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకోవడం, టవర్‌ బిజినెస్‌ విక్రయం తదితర పరిణామాలతో ఇటీవల భారీగా పతనమైన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కామ్‌) గత రెండు రోజులుగా లాభాలను నమోదు చేస్తోంది. అనిల్‌ అంబానీ నేతృత‍్వంలోని ఆర్‌కాంకు రుణ ఉపశమనం లభించనుండటంతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మంగళవారం దాదాపు 12శాతానికిపైగా లాభపడిన ఆర్‌ కాం కౌంటర్‌ నేడు 5శాతం లాభాలతో కొనసాగుతోంది.

ఢిల్లీ, చెన్నైలలో ఆర్‌కామ్‌కు గల ఆస్తుల విక్రయానికి రుణదాతలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ కంపెనీ ఈ రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులను విక్రయించేందుకు అనిమితినిచ్చిందని రిపోర్టులు వెలువెడ్డాయి. దీంతో రూ. 801 కోట్లవరకూ సమకూర్చుకోనుంది. ఈ నిధులను రుణాల చెల్లింపునకు వినియోగించనున్నట్లు అంచనా. దీంతో ఇప్పటికే భారీ రుణాలు, నష్టాలతో కుదేలైన అనిల్‌ అంబానీ గ్రూప్‌ టెలికం సంస్థ ఆర్‌కామ్‌కు ఇది కొంతమేర రిలీఫ్‌నిచ్చే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top