
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా కె. శ్రీకాంత్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఈయన కంపెనీ ఫైనాన్స్ విభాగ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. విద్యుత్ రంగంలో ఈయనకు 33 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందని.. క్యాపిటల్ బడ్జెటింగ్ రూపకల్పన, దీర్ఘకాలిక ఫైనాన్స్ ప్లానింగ్, వనరుల సమీకరణ వంటి అంశాల్లో మంచి పట్టు ఉందని కంపెనీ బుధవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.