‘వాయువేగంతో పోకో స్మార్ట్‌ఫోన్‌ సేవలు’ | Poco General Manager Comments On Realme Smart Phone | Sakshi
Sakshi News home page

వాయువేగంతో పోకో స్మార్ట్‌ఫోన్‌ సేవలు

Jun 18 2020 10:05 PM | Updated on Jun 18 2020 10:20 PM

Poco General Manager Comments On Realme Smart Phone  - Sakshi

ముంబై: మొబైల్‌ దిగ్గజం రియల్‌మీ  జూన్‌ 25న ఎక్స్‌3 స్మార్ట్‌ఫోన్‌ను‌ లాంచ్‌ చేయనుంది. అయితే మరోవైపు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ సబ్ బ్రాండ్ అయిన పోకో (స్మార్ట్‌ ఫోన్‌)ఇండియా జనరల్‌ మేనేజర్‌ సీ.మన్మోహన్‌‌ మాత్రం రిలయ్‌మీ ఎక్స్‌3 స్మార్ట్‌ ఫోన్‌ను క్రీప్‌(నెమ్మదైన ఫోన్‌గా) అభివర్ణించాడు. ట్టిటర్‌లో ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు సీ. మన్‌మోహన్‌ స్పందిస్తూ.. వాయు వేగంతో సేవలందించే  పోకో ఎక్స్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉండగా, మీరెందుకు రియల్‌మీ ఎక్స్‌2, ఎక్స్‌3 లాంటి నెమ్మదైన ఫోన్లను వాడడానికి ప్రయత్నిస్తారని యూజర్‌ను ప్రశ్నించారు. మరోవైపు పోకో మేనేజర్‌ గతంలో కూడా రియల్‌ మీ లాంచ్‌ చేసిన ఎక్స్‌ 50పప్రో (5జీ స్మార్ట్‌ఫోన్‌) నెట్‌వర్క్‌సేవలందించే ఫోన్‌ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్‌ దేశంలో ప్రస్తుతం 5జీ సేవలను ప్రజలు కోరుకోవడం లేదని, ప్రజలు కోరుకునే అన్ని సేవలను పోకో స్మార్ట్‌ఫోన్‌ అందిస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement