స్తంభించిన ఇన్‌స్టాగ్రామ్‌ | Photo-sharing app Instagram suffers global outage, down for many users | Sakshi
Sakshi News home page

స్తంభించిన ఇన్‌స్టాగ్రామ్‌

Oct 3 2018 2:11 PM | Updated on Oct 3 2018 4:49 PM

Photo-sharing app Instagram suffers global outage, down for many users - Sakshi

ప్రముఖ ఫోటో షేరింగ్‌ ప్లాట్‌ఫాం, ఫేస్‌బుక్‌  సొంతమైన  ఇన్‌స్టాగ్రామ్‌  సేవలు మరోసారి ప్రపంచంలోని పలు దేశాల్లో స్తంభించిపోయాయి. మొబైల్‌, డెస్క్‌టాప్‌ వెర్షన్లు  రెండూ పనిచేయలేదు. అమెరికా, కెనడా, యూరప్‌లతో పాటు ఇండియాలో కూడా కొన్ని గంటల పాటు సేవలు నిలిచిపోయాయి.  డౌన్‌ డిటెక్టర్‌ డేటా ఆధారంగా..  బుధవారం ఈ  సేవలు ఆగిపోయాయి.  గంట వ్యవధిలో  వెయ్యికి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. వినియోగదారులు లాగిన్‌ అయినపుడు "5xx సర్వర్ ఎర్రర్‌"ని చూపించింది.

ఈ అసౌకర్యంపై  సోషల్‌ మీడియాలో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా తమ అసంతృప్తిని తెలియజేస్తూ, జోకులను పోస్ట్‌ చేశారు. దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌ ఇంకా స్పందించలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement