రివర్స్‌గేర్‌లోనే కార్ల విక్రయాలు

Passenger vehicles sales down - Sakshi

ఆగస్టులో భారీ క్షీణత

మారుతీ అమ్మకాల్లో 33 శాతం తగ్గుదల

న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వాహన(పీవీ) విక్రయాలు మళ్లీ భారీ తగ్గుదలను నమోదుచేశాయి. ఆగస్టులో రెండంకెల క్షీణత నమోదైంది. టాటా మోటార్స్, హోండా కార్స్‌ అమ్మకాలు గతనెల్లో ఏకంగా సగానికి పైగా తగ్గిపోయాయి. మారుతీ విక్రయాలు 33 శాతం తగ్గాయి. అధిక బీమా, ద్రవ్యలభ్యత కొరత, వడ్డీ వ్యయం పెరగడం, బీఎస్‌–6 ఉద్గార నిబంధనల అమలు, రిజిస్ట్రేషన్‌ వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో వినియోగదారుల సెంటిమెంట్‌ బలహీనంగా ఉందని హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌సిఐఎల్‌) సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ డైరెక్టర్‌ (సేల్స్‌) రాజేష్‌ గోయెల్‌ అన్నారు. ఆగస్టులోనూ ఇవే ప్రతికూలతలు కొనసాగినందున ఈ స్థాయి క్షీణత నమోదైందని టీకేఎం డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ రాజా వ్యాఖ్యానించారు. ఆటోమొబైల్‌ రంగంలో మందగమనం కొనసాగుతున్నప్పటికీ తమ కంపెనీ రిటైల్‌ అమ్మకాలపై దృష్టిసారిస్తుందని టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరీక్‌ అన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top