పసిడిలో పెట్టుబడులు పటిష్టమే!

Nowadays it is safe to invest gold - Sakshi

ప్రస్తుతం పెట్టుబడులకు పసిడి సురక్షిత సాధనమేనని నిపుణుల అంచనా. న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌లో పసిడి ధర 20వ తేదీతో ముగిసిన వారంలో ఔన్స్‌కు (31.1గ్రా) 1,482 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న అంచనాలు, అమెరికా స్థూల దేశీయోత్పత్తి, ప్రత్యేకించి వినియోగ గణాంకాలు సానుకూలత, డాలర్‌ పటిష్టత వంటి అంశాలు స్వల్పకాలంలో పసిడి ధర దిగువకు రావడానికి కొంత దారితీసినా.. 1,450 డాలర్ల వద్ద పసిడికి పటిష్ట మద్దతు ఉందన్నది వాదన. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన ధోరణుల వల్ల పసిడి దీర్ఘకాలంలో పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అనిశ్చితిని ధీటుగా ఎదుర్కొనడానికి పసిడి కొనుగోళ్లవైపు మొగ్గుచూపాలని ఇరాన్, మలేషియా, టర్కీ, కతార్‌లు భావిస్తున్నట్లు స్వయంగా మలేషియా ప్రధానమంత్రి మహతీర్‌ మహ్మద్‌ ప్రకటించడం ఇక్కడ గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top