మెహుల్‌ చోక్సి ఇక్కడ లేడు

Mehul Choksi Not In US: Interpol - Sakshi

వాషింగ్టన్‌ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన డైమండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీ, ఆయన మేనమామ మెహుల్‌ చోక్సిలు ప్రపంచంలో ఏ మూలన దాగి ఉన్నారా? అంటూ గల్లిగల్లి వెతుకున్నారు. వారిద్దరిన్నీ పట్టుకోవడానికి ప్రతి ఒక్క​ దేశం భారత్‌కు, సాయపడుతోంది. తమ దేశంలో ఏమైనా నక్కి ఉన్నారేమోనని వెతుకులాట చేపట్టిన ఇంటర్‌ పోల్‌ వాషింగ్టన్‌, మెహుల్‌ చోక్సి తమ దేశంలో లేడంటూ క్లారిటీ ఇచ్చింది. గత బుధవారం భారత్‌ పంపిన అభ్యర్థనకు ఇంటర్‌పోల్‌ వాషింగ్టన్ స్పందించింది. మెహుల్‌ చోక్సి అమెరికాలో లేడని తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయితే వెంటనే ఇంటర్‌పోల్‌ వాషింగ్టన్‌కు భారత్‌ మరో లేఖ పంపింది. చోక్సి ఆచూకీ గురించి ఏమైనా తెలిస్తే తమకు అందజేయాలని కోరింది.

కాగ, పారిపోయిన ఆర్థిక నేరస్తుల ఆర్డినెన్స్‌ 2018 కింద నీరవ్‌, చోక్సిలకు వ్యతిరేకంగా ఈడీ రెండు దరఖాస్తులను ముంబైలోని మనీ లాండరింగ్‌ నిరోధక చట్ట స్పెషల్‌ కోర్టులో జూన్‌ 11న నమోదు చేసింది. భారత్‌, యూకే, యునిటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లలో ఉన్న వారి ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా ఈడీ కోరింది. ఇప్పటివే నీరవ్‌ మోదీపై నాన్‌ బెయిలబుల్‌ వారెంటీ జారీ అయి ఉంది. అతనికి వ్యతిరేకంగా ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు కూడా జారీచేసింది. నీరవ్‌ ప్రవేశాన్ని అడ్డుకోవాలని ఇతర దేశాలను భారత్‌ కోరిందని కూడా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. నీరవ్‌ ఆచూకీ తెలుసుకునేందుకు ఫ్రాన్స్‌, యూకే, బెల్జియం వంటి యూరోపియన్‌ దేశాల సహాయం కూడా భారత్‌ తీసుకుంటోందని పేర్కొంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top