ఎల్‌జీ బెల్లో@రూ.18,500 | LG launches Bello smartphone for Rs 18,500 | Sakshi
Sakshi News home page

ఎల్‌జీ బెల్లో@రూ.18,500

Oct 15 2014 12:39 AM | Updated on Nov 6 2018 5:26 PM

ఎల్‌జీ బెల్లో@రూ.18,500 - Sakshi

ఎల్‌జీ బెల్లో@రూ.18,500

ఎల్‌జీ కంపెనీ ఎల్ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్, బెల్లోను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ధర రూ.18,500 అని ఎల్‌జీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్: ఎల్‌జీ కంపెనీ ఎల్ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్, బెల్లోను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ధర రూ.18,500 అని ఎల్‌జీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.  తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ జీ3కు అందుబాటు ధరలో లభించే ప్రత్యామ్నాయ ఫోన్‌గా ఈ ఎల్ బెల్లో ఫోన్‌ను అందిస్తున్నామని ఎల్‌జీ మొబైల్స్, ఇండియా మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ పేర్కొన్నారు.

ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,  1.3 గిగాహెర్ట్స్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2,540 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లున్నాయని వివరించారు. స్క్రీన్‌పై ఎక్కడ టచ్ చేసినా ఫొటో/వీడియో తీసుకునే టచ్ అండ్ షూట్ ఫీచర్ కూడా ఉందని తెలిపారు. గెశ్చర్ షాట్ ఫీచర్‌తో చేతుల స్వల్ప కదలికలతోనే సెల్ఫీలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. నాక్‌కోడ్, స్మార్ట్ కీబోర్డ్, గెస్ట్‌మోడ్, క్యాప్చర్ ప్లస్, ఈజీ హోమ్, క్యూస్లైడ్, క్విక్ మెమోప్లస్ వంటి ఫీచర్లున్నాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement