ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్‌ ల్యాప్‌టాప్‌

LENOVO UNVEILS WORLD FIRST LAPTOP WITH FOLDABLE DISPLAY  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇప్పటివరకూ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లు, టీవీలను చూశాం. తాజాగా మడతపెట్టే ల్యాప్‌టాప్‌లురానున్నాయి. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్న చైనా టెక్‌ కంపెనీ లెనోవో ప్రోటోటైప్‌ ఫోల్డబుల్‌ ల్యాపీని ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్‌ పీసీ అని లెనోవో ఒక ప్రకటనలో వెల్లడించింది. ల్యాప్‌టాప్ ఆకారంలో మడవటానికి వీలుగా వుంటుందీ డివైస్‌. ఫోల్డబుల్ స్క్రీన్‌తో ఫుల్‌ ప్లెడ్జ్‌డ్‌ ల్యాప్‌టాప్‌ అని కంపెనీ తెలిపింది.   ‘థింక్ ఫ్యాడ్ ఎక్స్1’ అని పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది.

ఇక ఫీచర్స్ విషయానికొస్తే..13.3 అంగుళాల పరిమాణంలో తీర్చిదిద్దారు. 9.3 ఇంచీల స్క్రీన్, ఇంటెల్ ప్రాసెసర్, యూఎస్‌బీ పోర్ట్స్, ఇన్‌ఫ్రార్డ్ కెమెరా, స్టీరియో స్పీకర్స్, హై-రిజల్యూషన్ డిస్ ప్లే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ప్రధాఫీచర్లుగా ఉన్నాయి. 2020 నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు రావాలని ప్లాన్‌ చేస్తున్నామని పేర్కొంది. ధర వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించిపోయినప్పటికీ, మూడు నుంచి 4వేల డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. ఈ డివైస్‌కు సంబంధించిన దీంతో ల్యాప్‌టాప​ టెక్‌ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top