జియో గుడ్ న్యూస్ 

Jio launches Work From Home Pack For Rs 251 - Sakshi

సాక్షి, ముంబై:  కరోనావైరస్  శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రముఖ టెల్కో  రిలయన్స్ జియో తన  వినియోగదారులకు శుభవార్త అందించింది. ముఖ్యంగా లాక్ డౌన్ , ఇతర ఆంక్షల కారణంగా ఇంటి నుంచే పనిచేస్తున్న వారికోసం  రిలయన్స్ జియో  'వర్క్ ఫ్రమ్ హోమ్ ప్యాక్' ను ప్రారంభించింది. తాజాగా  లాంచ్ చేసిన రూ. 251  ప్లాన్ లో వినియోగదారులు రోజుకు  జీబీ 4జీ డేటాను పొందవచ్చు. అంతేకాదు 100 శాతం డేటా వినియోగం పూర్తయిన తర్వాత, వినియోగదారులు 64 కేబీపీఎస్ తక్కువ వేగంతో ఇంటర్నెట్ డేటాను అపరిమితంగా మిగిలిన రోజులో కూడా ఉపయోగించడం కొనసాగించవచ్చు.  అయితే లిమిట్ దాటిన తరువాత డేటా బ్రౌజింగ్ కుమాత్రమే పరిమితం. వీడియోలు ప్లే కావు.  120 జీబీ దాకా డేటాను వాడుకోవచ్చు. 51 రోజుల పాటు ఈ ప్లాన్ చెల్లుబాటులో వుంటుంది. అయితే దీనికి వాయస్ కాల్స్, ఎస్ ఎంఎస్  సేవలు లభించవు.

కాగా  కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తగా మత్యు ఘంటికలు మోగిస్తోంది.  దేశంలో ఇప్పటికే  430 పాజిటివ్‌ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.  కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా కఠినమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో  కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ  ఉద్యోగులతో పాటు ఐటీ,  కార్పొరేట్, బ్యాంకింగ్ తదితర  రంగాలు  ఉద్యోగులు ఎక్కువగా ఇంటినుంచే  తమ విధులను నిర్వరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ వినియోగదారులకు నెల రోజుల పాటు బ్రాండ్ సేవలను ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే.  దీంతో  దేశవ్యాప్తంగా డేటా వాడకం అత్యంత గరిష్టానికి చేరుకుంది.

చదవండి: ఎయిర్‌టెల్‌ కాదు.. జియోనే టాప్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top