జియో ఫైబర్:  రూ.199కే 1000 జీబీ డేటా

Jio Fiber Rs 199 Combo plan announced offers 1000GB data - Sakshi

జియో ఫైబర్ కొత్త కాంబో ప్లాన్

సాక్షి, ముంబై : మహమ్మారి కరోనా  వైరస్ వ్యాప్తి,  లాక్‌డౌన్‌ ఆంక్షలతో  దాదాపు ప్రజలందరూ  ఇంటికే పరిమితమవుతున్నారు.  దీంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ డేటా వినియోగం భారీగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో దేశీయ టెలికాం కంపెనీలు తమ ఇంటర్నెట్, డేటా ప్లాన్లను ఎప్పటికపుడు సమీక్షిస్తున్నాయి. తాజాగా  రిలయన్స్ జియో ఫైబర్  (ఫైబర్-టు-హోమ్) వినియోగదారులకోసం  ఒక అద్భుతమైన కాంబో ప్లాన్ ను ప్రకటించింది. రూ.199 లకు వేగవంతమైన 1000 జీబీ  డేటాను అందిస్తున్నట్టు ప్రకటించింది. 

ఈ ప్లాన్ వాలిడిటీ స్వల్ప కాలం అంటే  7 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. అంతేకాదు, ఈ ప్లానులో డేటా 100 ఎంబీపీఎస్ వేగంతో వస్తుంది. ఈ కాంబో ప్లాన్  ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అయిపోయిన వారికి, లేదా అదనపు డేటా అవసరం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే లిమిట్ దాటిన అనంతరం ఇది ఒక ఎంబీపీఎస్కు పడిపోతుందని వెల్లడించింది. పాత కస్టమర్లతోపాటు కొత్త వారికి కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, రూ. 199 కాంబో ప్లాన్ జీఎస్టీతో కలిపి మొత్తం రూ .234 ఖర్చు అవుతుంది. దీంతోపాటు ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, మైజియో యాప్ కాంప్లిమెంటరీ యాక్సెస్ లేదా ఉచిత ఎస్ఎంఎస్ వంటి అదనపు ప్రయోజనాలు ఈ కాంబో ప్లాన్ లో లభించవు. (కరోనా సంక్షోభం : టీసీఎస్ కీలక నిర్ణయం)

కాగా కోవిడ్ -19  కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలంతా ఇంటర్నెట్ పైనే ఎక్కువ కాలం గడుపుతున్నారు.  పెరిగిన డేటా వినియోగాన్ని అందిపుచ్చుకునే  క్రమంలో టెలికాం దిగ్గజాలు తమ డేటాప్లాన్లను సమీక్షిస్తుండటంతో పాటు రీఛార్జ్  సౌకర్యాన్ని సులభతరం చేశాయి.  జియో పాటు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా చందాదారులు ఏటీఎం సెంటర్లలో రీఛార్జ్‌ చేసుకునే వెసులుబాటును ఇటీవల ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. (రూపాయికి ఆర్‌బీఐ 'శక్తి')

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top