‘దేశీ’ జాగ్వార్‌ ఎక్స్‌ఎఫ్‌ @ 47.5 లక్షలు | Jaguar Launches Locally Manufactured XF; Prices start At Rs. 47.50 Lakh | Sakshi
Sakshi News home page

‘దేశీ’ జాగ్వార్‌ ఎక్స్‌ఎఫ్‌ @ 47.5 లక్షలు

Feb 24 2017 12:48 AM | Updated on Sep 5 2017 4:26 AM

‘దేశీ’ జాగ్వార్‌ ఎక్స్‌ఎఫ్‌ @ 47.5 లక్షలు

‘దేశీ’ జాగ్వార్‌ ఎక్స్‌ఎఫ్‌ @ 47.5 లక్షలు

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఇండియా దేశీయంగా తయారు చేసిన జాగ్వార్‌ ఎక్స్‌ఎఫ్‌ సెడాన్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది.

న్యూఢిల్లీ: జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఇండియా దేశీయంగా తయారు చేసిన జాగ్వార్‌ ఎక్స్‌ఎఫ్‌ సెడాన్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ప్రారంభ ధర రూ.47.50 లక్షలు(ఎక్స్‌ షోరూమ్, ఢిల్లీ).  ఈ కారు రెండు వేరియంట్లలో లభి స్తుందని జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఇండియా తెలిపింది. 2–లీటర్‌  ఇంజినియమ్‌ డీజిల్, 2 లీటర్‌ పెట్రోల్‌  వేరియంట్లలలో ఈ కారు లభిస్తుందని కంపెనీ ఎండీ, ప్రెసిడెంట్‌ రోహిత్‌ సూరి చెప్పారు. 2009లో ఈ కారును భారత్‌లోకి తెచ్చామని, మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు.

26 సెం.మీ. టచ్‌ స్క్రీన్‌ ఇన్పోటైన్‌మెంట్‌ సిస్టమ్, మెరిడియన్‌ సౌండ్‌ సిస్టమ్‌ వంటి అత్యాధునిక సాంకేతిక ఫీచర్లున్నాయని వివరించారు. ప్రస్తుతం జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ ఇండియా కంపెనీ నాలుగు మోడళ్లను  ఎఫ్‌–టైప్‌(ప్రారంభ ధర రూ.1.25 కోట్లు),  ఎక్స్‌జే(ధర రూ.99.99 లక్షలు),ఎఫ్‌–పేస్‌(రూ.68.40 లక్షలు), ఎక్స్‌ఈ(రూ.39.90 లక్షలు).. భారత్‌లో విక్రయిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement