ఇషా అంబానీ ఎంగేజ్‌మెంట్‌ అక్కడే...

Isha Ambani Engagement Venue Details - Sakshi

భారతీయ కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ వివాహం.. పిరమాల్‌ గ్రూప్‌ చైర్మన్‌ అజయ్‌ పిరమాల్‌ తనయుడు ఆనంద్‌ పిరమాల్‌ తో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో మహాబలేశ్వర్‌లోని గుడిలో ఆనంద్‌ ఇషాకు ప్రపోజ్‌ చేశాడు. వీరివురి ప్రేమకు ఇరు కుటుంబాల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. దీంతో రెండు కుటుంబాలు కలిసి మే నెలలో ఓ ప్రైవేట్‌ పార్టీ నిర్వహించి ప్రేమజంటను ఆశీర్వదించారు. కాగా ప్రస్తుతం వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వేదిక ఎక్కడంటే..
జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఇషా, ఆనంద్‌ల ఎంగేజ్‌మెంట్‌కు ఇటలీలోని ‘లేక్‌ కోమో’  వేదిక కానుంది. హాలీవుడ్‌ సెలబ్రిటీల ఫేవరెట్‌ ప్లేస్‌, అత్యంత ఖరీదైన హాలీడే స్పాట్‌ లేక్ కోమోలో.. సెప్టెంబరు 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు నిశ్చితార్థ వేడుకలు అట్టహాసంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అతిథులకు అంబానీ దంపతులు లావిష్‌ లంచ్‌, డిన్నర్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆరోజు సాయంత్రం నుంచి లేక్‌ కోమోలోని విల్లా బల్బియానోలో నిశ్చితార్థ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇక రెండో రోజు సంగీత్‌, డిన్నర్‌లతో ముగియనుంది. ఆదివారం లంచ్‌తో అతిథులకు వీడ్కోలు పలుకనున్నారు.

మూడు రోజుల పాటు..కార్యక్రమాలు- డ్రెస్‌కోడ్‌
మొదటి రోజు : లంచ్‌- బెనవెంటో కోమో(కోమోకి స్వాగతం) డ్రెస్‌కోడ్‌- క్యాజువల్‌ చిక్‌, డిన్నర్‌- అమోర్‌ ఈ బెల్లోజా (లవ్‌ అండ్‌ బ్యూటీ) డ్రెస్‌కోడ్‌- ఇండియన్‌ ఫార్మల్స్‌ విత్‌ బ్లాక్‌ టై.
రెండోరోజు : లంచ్‌- ఫీరా బెల్లా ఇటాలియా(బ్యూటిఫుల్‌ ఫేర్‌ ఇటలీ), డ్రెస్‌కోడ్‌- కోమో చిక్‌, సంగీత్‌- ట్రూలీ ఇటాలియన్‌ డ్రెస్‌కోడ్‌- కాక్‌టేల్‌ అట్టైర్‌
మూడోరోజు : లంచ్‌- గుడ్‌బై కోమో, డ్రెస్‌కోడ్‌- క్యాజువల్‌ డ్రెస్‌ కోడ్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top