ఇంటెక్స్ సౌత్ బ్రాండ్ అంబాసిడర్‌గా అనుష్క | INTEX south brand ambassador Anushka | Sakshi
Sakshi News home page

ఇంటెక్స్ సౌత్ బ్రాండ్ అంబాసిడర్‌గా అనుష్క

Aug 17 2014 12:45 AM | Updated on Sep 2 2017 11:58 AM

ఇంటెక్స్ సౌత్ బ్రాండ్ అంబాసిడర్‌గా అనుష్క

ఇంటెక్స్ సౌత్ బ్రాండ్ అంబాసిడర్‌గా అనుష్క

దేశంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ఇంటెక్స్ టెక్నాలజీస్ ప్రకటించింది.

ధర రెండువేల లోపే

మార్కెట్లోకి ఆక్వా స్టైల్ ప్రో విడుదల
ఇంటెక్స్ సౌత్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటి అనుష్క

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ఇంటెక్స్ టెక్నాలజీస్ ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌లోని అన్ని ఫీచర్స్ ఉండే విధంగా రూపొందించిన ఈ ఫోన్‌ను ఈ నెలాఖరులోగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఇంటెక్స్ మార్కెటింగ్ డెరైక్టర్ కేశవ్ బన్సాల్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ ‘ఆక్వా స్టైల్ ప్రో’ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ చౌక స్మార్ట్‌ఫోన్ ధర 2వేలకు సమీపంలో ఉంటుందన్నారు.
 
ప్రస్తుతం ఉత్తర, పశ్చిమ భారతదేశంలో మంచి పట్టు సాధించిన ఇంటెక్స్ ఇప్పుడు దక్షిణాది మార్కెట్‌పై అధికంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. అందులోభాగంగా తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కోసం అనుష్కను, కర్ణాటకకు సుదీప్‌ను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఇంటెక్స్ మొబైల్ డివిజన్ మార్కెటింగ్ కోసం రూ. 140 కోట్ల బడ్జెట్‌ను కేటాయించగా అందులో రూ. 35 నుంచి 40 కోట్లు వచ్చే 3,4 నెలల్లో కేవలం దక్షిణాది రాష్ట్రాల్లోనే వ్యయం చేయనున్నట్లు బన్సాల్ తెలిపారు. అలాగే వచ్చే 4 నెలల్లో రూ. 2,000 నుంచి రూ. 10,000 ధరల శ్రేణిలో 8 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు. గతేడాది రూ. 1,350 కోట్లుగా ఉన్న మొబైల్ డివిజన్ వ్యాపారం ఈ ఏడాది రూ. 2,700 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
 
ఆక్వా స్టైల్ ప్రో రూ. 6,990
అంతకుముందు దక్షిణాది రాష్ట్రాల బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన టాలీవుడ్ నటి అనుష్క ‘ఆక్వా స్టైల్ ప్రో’ను మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశా రు. 1జీబీ రామ్, 1.2 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 4.4 కిటికాట్, 3జీ నెట్‌వర్క్ వంటి ఫీచర్స్‌తో కూడిన ఆక్వా స్టైల్ ప్రో ధరను రూ. 6,990గా నిర్ణయించారు. ఇంటెక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా అనుష్క ఒక సంవత్సరం పాటు వ్యవహరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement