ఇన్ఫోసిస్‌  మరో షేర్ల బైబ్యాక్‌!  | Infosys shares rise 2% on share buyback buzz | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌  మరో షేర్ల బైబ్యాక్‌! 

Dec 25 2018 12:37 AM | Updated on Dec 25 2018 12:37 AM

Infosys shares rise 2% on share buyback buzz - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మరో షేర్ల బైబ్యాక్‌కు సిద్ధమవుతోందని సమాచారం. వచ్చే నెల 11న జరిగే డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశంలో క్యూ3 ఆర్థిక ఫలితాలతో పాటు షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదన కూడా పరిశీలించవచ్చని ఒక ఆంగ్ల దినపత్రిక వెల్లడించింది.  ఈ షేర్ల బైబ్యాక్‌ రూ.11,200 కోట్లు(160 కోట్ల డాలర్ల)మేర ఉండొచ్చని, షేర్ల బైబ్యాక్‌ ధర ప్రస్తుత ధర కంటే 20–25 శాతం అధికంగా ఉండొచ్చని అంచనా. ఈ షేర్ల బైబ్యాక్‌లో కంపెనీ వ్యవస్థాపకులకు చెందిన కుటుంబ సభ్యులు తమ షేర్లను విక్రయిస్తారని ఆ పత్రిక పేర్కొంది.

 కాగా ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.13,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను పూర్తిచేసింది. కాగా స్పెషల్‌ డివిడెండ్‌ రూపంలో ఇన్వెస్టర్లకు రూ.2,600 కోట్లు చెల్లించనున్నామని ఇటీవలే ఇన్ఫోసిస్‌ డైరెక్టర్ల బోర్డ్‌ వెల్లడించింది. మరో రూ.10,400 కోట్ల నగదును ఈ ఆర్థిక సంవత్సరంలోనే వాటాదారులకు చెల్లించనున్నామని,  ఏ రూపంలో చెల్లించాలో డైరెక్టర్ల బోర్డ్‌ నిర్ణయింస్తుందని పేర్కొంది. కాగా ఇటీవలనే ఐటీ దిగ్గజాలు–టీసీఎస్, విప్రో, కాగ్నిజంట్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, మైండ్‌ ట్రీలు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement