పేటీఎం, ఫ్లిప్‌కార్ట్‌లకు పెరుగుతున్న క్రేజ్‌

Indians Pefer Homegrown Firms Like Paytm, Flipkart - Sakshi

ప్రపంచ టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, అమెజాన్‌లకు భారతీయుల్లో క్రేజ్‌ తగ్గిపోయింది. దేశీయ టెక్‌, మొబైల్‌ కంపెనీలకు డిమాండ్‌ పెరిగింది. ఎందుకంటే భారతీయ నిపుణులు ఎక్కువగా డైరెక్టి, ఫ్లిప్‌కార్ట్‌, వన్‌97 కమ్యూనికేషన్స్‌(పేటీఎం)లలో పనిచేయాలనుకుంటున్నారని లింక్డ్‌ఇన్‌ రిపోర్టు వెల్లడించింది. గ్లోబల్‌ టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, అమెజాన్‌ కంపెనీల్లో కంటే దేశీయ ఈ టెక్‌, మొబైల్‌ ఇంటర్నెట్‌  కంపెనీల్లో భారతీయ నిపుణులు ఎక్కువగా వర్క్‌ చేయాలనుకుంటున్నారని తెలిపింది. 

భారతీయ నిపుణులు ఎక్కువగా పనిచేయాలని కోరుకునే 25 కంపెనీల ర్యాంకింగ్‌లు కూడా ఈ డేటాలో ఉన్నాయి. కంపెనీలో ఆసక్తి, కంపెనీ ఉద్యోగులతో ఎంగేజ్‌మెంట్‌, ఉద్యోగ డిమాండ్‌, ఉద్యోగ నిలుపుదలను నాలుగు పిల్లర్స్‌గా తీసుకుని లింక్డ్‌ఇన్‌ ఈ డేటా రూపొందించింది. ఈ జాబితాలో లింక్డ్‌ఇన్‌, పేరెంట్‌ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లను కలుపలేదు. గత రెండు సంవత్సరాలుగా రెండో స్థానంలో ఉంటూ వస్తున్న అమెజాన్‌, ఈ సారి నాలుగో స్థానానికి పడిపోయింది. మొదటి మూడు కంపెనీలుగా డైరెక్టి, ఫ్లిప్‌కార్ట్‌, వన్‌97 కమ్యూనికేషన్లు ఉన్నాయి. గూగుల్‌ పేరెంట్‌ కంపెనీ ఆల్ఫాబెట్‌ టాప్‌ కంపెనీల జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది.  

టాప్‌ కంపెనీల జాబితాలో ఎక్కడ భారతీయులు ప్రస్తుతం పనిచేయాలనుకుంటున్నారు, దేశీయ కంపెనీల నుంచి గ్లోబల్‌ దిగ్గజాల వరకు ఏ కంపెనీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుపుతూ ఈ జాబితాను విడుదల చేసినట్టు లింక్డ్‌ఇన్‌ ఇండియా ఎడిటర్‌ అదిత్‌ చార్లీ అన్నారు. ఈ జాబితాలో 2017లో ఐదో స్థానంలో ఉన్న ఓలా 11వ స్థానాలు పడిపోయి, 16వ ర్యాంకులో నిలిచింది. 

భారతీయులు పనిచేయాలనుకుంటున్న టాప్‌ 25 కంపెనీలివే..
డైరెక్టి, ఫ్లిప్‌కార్ట్‌, వన్‌97 కమ్యూనికేషన్స్‌, అమెజాన్‌, అనెషీర్-బుష్ ఇబ్వ్ , మెకిన్సే అండ్‌ కంపెనీ, ఆల్ఫాబెట్‌, కేపీఎంజీ ఇండియా, ఈవై, ఓవైఓ, డైమ్లెర్‌ ఏజీ, అడోబ్‌, ఎక్స్‌పీడియా, మోర్గాన్‌ స్టాన్లీ, డీబీఎస్‌ బ్యాంకు, ఓలా, జీఈ, మేక్‌మైట్రిప్‌, పీడబ్ల్యూసీ, గోల్డ్‌మ్యాన్‌ శాచ్స్‌, షెల్‌, జేపీమోర్గాన్‌ ఛేస్‌ అండ్‌ కంపెనీ, యూనిలివర్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, డెలాయిట్‌ ఇండియా.   
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top