మార్కెట్లోకి సరికొత్త బైక్‌: ధర రూ.48లక్షలు

Indian Motorcycle launches Roadmaster Elite at Rs 48 lakh - Sakshi

సాక్షి, ముంబై: ఇండియన్‌ మోటార్స్‌ సైకిల్స్‌ సరికొత్త  బైక్‌ను లాంచ్‌ చేసింది.  పోలారి  ఇండస్ట్రీస్‌ సొంతమైన  ఇండియన్ మోటార్ సైకిల్   రోడ్‌మాస్టర్‌ ఎలైట్‌ను భారత మార్కెట్లో    ప్రవేశపెట్టింది. దీని ధరను  రూ. 48 లక్షల (ఎక్స్-షోరూమ్ ధర) వద్ద ప్రారంభించింది.బైక్‌ ఫ్యూయల్‌ ట్యాంక్‌పై 23 క్యారెట్‌ గోల్డ్‌ లీఫ్‌ బ్యాడ్జింగ్‌ను రూపొందించడం ప్రధాన ఆకర్షణ. 1811  ఇంజీన్‌  సిసి థండర్‌ స్ర్టోక్‌ వి-ట్విన్‌ ఇంజన్‌ను ఈ బైక్‌ కలిగి ఉంది.

ఈ ఏడాదిలో 60-70 శాతం వృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో ఉన్నామని, ఇందుకోసం నెట్‌వర్క్‌ విస్తరణను చేపట్టనున్నామని ఇండియన్‌ మోటార్‌సైకిల్‌ మాతృ సంస్థ పోలారిస్‌ ఇండస్ర్టీస్‌ భారత అనుబంధ సంస్థ పోలారిస్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, కంట్రీ హెడ్‌ పంకజ్‌ దూబే తెలిపారు. డ్యుయల్‌ టోన్‌ క్యాండీ పెయింట్‌ ఈ బైక్‌ ప్రత్యేకత అని చెప్పారు.  రిమోట్ - లాకింగ్ హార్డ్ సాడిల్ బ్యాగ్స్, 36 కిలో కార్గో స్పేస్, ఏబీఎస్‌ బ్రేక్స్‌,  పుష్ - బటన్ పవర్ విండ్‌షీల్డ్‌,   పిన్నాకిల్ మిర్రర్స్ ,   ప్రీమియం టూరింగ్ సాడిల్, ప్యాసింజర్ ఆర్మ్ రెస్ట్ ఇతర ప్రధాన  స్పెసిఫికేషన్లు ఉన్నాయి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top