
4జీ సేవల ప్రారంభానికి బీఎస్ఎన్ఎల్ కసరత్తు
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా 4జీ సేవల ప్రారంభంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా 4జీ సేవల ప్రారంభంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా రెవెన్యూ షేరింగ్ విధానంలో 14 టెలికం సర్కిళ్లలో 4జీ సేవలను ప్రారంభించడానికి టెక్నాలజీ పార్ట్‌నర్స్‌తో జతకట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికే రెవెన్యూ షేరింగ్ విధానంలోనే చండీగఢ్‌లో 4జీ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ‘4జీ సేవల ప్రారంభానికి సంస్థ మేనేజ్‌మెంట్ కమిటీ ఆ మోదం తెలిపింది. రెవెన్యూ షేరింగ్ విధానంలో సేవలను ప్రారంభించాలని భావిస్తున్నాం’ అని బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ శ్రీవాత్సవ తెలిపారు. టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌కు తాము కేవలం బ్యాండ్‌విడ్త్‌ను మాత్రమే అందిస్తామని చెప్పారు.