
నేడు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లిస్టింగ్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేడు(గురువారం) మార్కెట్లో లిస్ట్ కానున్నది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్న తొలి బీమా కంపెనీ ఇదే.
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేడు(గురువారం) మార్కెట్లో లిస్ట్ కానున్నది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్న తొలి బీమా కంపెనీ ఇదే. ఈ నెల 19-21 మధ్య వచ్చిన రూ.6,057 కోట్ల ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఐపీఓ 10 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓకు ధరల శ్రేణిని రూ.300-334గా కంపెనీ నిర్ణయించింది. 2010లో వచ్చిన కోల్ ఇండియా ఐపీఓ (రూ.15,000 కోట్లు) తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ.