తొలిసారి : ఐసీఐసీఐ బ్యాంక్‌కి భారీ నష్టాలు

ICICI Bank Reports Q1 Loss At Rs 120 Crore - Sakshi

ముంబై : వీడియోకాన్‌ రుణ వివాదం... ఏకంగా బ్యాంక్‌ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌పైనే పెద్ద ఎత్తున వచ్చిన ఆరోపణలు... ఐసీఐసీఐ బ్యాంక్‌ను ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. తాజాగా తొలి క్వార్టర్‌ ఫలితాల్లో కూడా ఐసీఐసీఐ బ్యాంక్‌ భారీగా పడిపోయింది. నేడు ప్రకటించిన జూన్‌ క్వార్టర్‌ ఫలితాల్లో ఏకంగా బ్యాంక్‌ రూ.119.55 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. కనీసం ఏ మాత్రం లాభాలు లేకుండా.. నష్టాల్లో కూరుకుపోవడం, బ్యాంక్‌ స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయినప్పటి నుంచి ఇదే మొదటిసారి. 1998లో ఐసీఐసీఐ బ్యాంక్‌ స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో బ్యాంక్‌ లాభాలు రూ.2,049 కోట్లగా ఉన్నాయి. 

బ్యాంక్‌ ప్రొవిజన్లు ఏడాది ఏడాదికి రెండింతలు పైగా పెరిగాయి. క్వార్టర్‌ రివ్యూలో ప్రొవిజన్లు రూ.128.86 శాతం పెరిగి రూ.5,971 కోట్లగా నమోదైనట్టు వెల్లడైంది. క్వార్టర్‌ క్వార్టర్‌కు మాత్రం ఈ ప్రొవిజన్లు 10 శాతం తగ్గాయి. అయితే బ్యాంక్‌ కేవలం లాభాలను మాత్రమే పోగొట్టుకుంటుందని, లాభాలను 31 శాతం తగ్గించుకుని రూ.1422 కోట్ల నికర లాభాలను నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనావేశారు. వీరి అంచనాలన్నింటిన్నీ ఐసీఐసీఐ బ్యాంక్‌ తలకిందులు చేసింది. ఏకంగా నష్టాలనే నమోదు చేసింది. అది పది, పదిహేను కోట్లు కాకుండా.. ఏకంగా రూ.120 కోట్ల మేర నికర నష్టాలను బ్యాంక్‌ ప్రకటించింది. అయితే బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు తగ్గడంతో, ఆస్తుల నాణ్యత మెరుగుపడింది.

2018 మార్చితో ముగిసిన క్వార్టర్‌లో బ్యాంక్‌ ఎన్‌పీఏలు 8.84 శాతం నుంచి 8.81 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు కూడా 4.77 శాతం నుంచి 4.19 శాతానికి పడిపోయాయి. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయాలు ఏడాది ఏడాదికి 9.16 శాతం పెరిగి రూ.6,102 కోట్లు పెరిగినట్టు తెలిసింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో ఇవి రూ.5,590 కోట్లగా ఉన్నాయి. కాగ, సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ చందా కొచ్చర్‌ లేకుండా.... ప్రకటించిన తొలి ఫలితాలు ఇవి. ప్రస్తుతం ఆమె వీడియోకాన్‌ రుణ వివాదం వల్ల, బ్యాంక్‌ స్వతంత్ర విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సెలవులో ఉన్నారు. బ్యాంక్‌ కొత్త సీఓఓగా సందీప్‌ భక్షిని నియమించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top