కొనడానికైనా.. అద్దెకైనా భాగ్యనగరమే బెస్ట్‌

hyderabad is the best place to sell or rent - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భాగ్యనగరంలో సొంతిల్లు.. ఉన్నోళ్లకు మాత్రమే అనేది చాలా మంది అభిప్రాయం. కానీ, ఏడాదికి రూ.9 లక్షల ఆదాయమున్న ప్రతీ ఒక్కరూ సొంతిల్లు సొంతం చేసుకోవచ్చు. అంటే దీనర్థం నేటికీ హైదరాబాద్‌లో స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉన్నాయని! కొనడానికే కాదు అద్దెకుండేందుకైనా చారిత్రక నగరి దగ్గరిదారేనని ఓ ప్రముఖ సంస్థ సర్వేలో తేలింది. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పుణెల్లో ‘‘స్థిరాస్తి కొనుగోలు.. అద్దెలు’’ అంశంపై సర్వే చేసింది.

హైదరాబాద్‌..
నగరంలో స్థిరాస్తి కొనేందుకైనా, అద్దెకుండేదుకైనా ధరలు అందుబాటులోనే ఉన్నాయి.
 నాలుగేళ్లుగా వాణిజ్య సముదాయాల అద్దె ధరలు 6.3 శాతం పెరిగాయి. అదే సమయంలో నివాస సముదాయాల ధరలు 10.46 శాతం మేర పడిపోయాయి.
  ఏడాదికి రూ.9 లక్షల ఆదాయం సంపాదించేవారు ఇక్కడ నివాస సముదాయాన్ని కొనుగోలు చేయవచ్చు.

బెంగళూరు..
 ఐటీ, స్టార్టప్‌ హబ్‌గా పేరొందిన గార్డెన్‌ సిటీ.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కు వగా ఉండటంతో ఇక్కడ నివాస, వాణిజ్య సముదాయాల అద్దెలకు గిరాకీ ఉంది.
 గతేడాదితో పోల్చితే ఇక్కడి అద్దెలు 10.08 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో స్థిరాస్తి ధరలు మాత్రం 2.55 శాతం మేర పడిపోయాయి.
 ఇక్కడ స్థిరాస్తిని కొనుగోలు చేయాలంటే ఏడాదికి కనీసం రూ.15 లక్షల ఆదాయం ఉండాల్సిందే.

చెన్నై..
 దేశంలో స్థిరాస్తి ధరలు ప్రియంగా ఉన్న నగరాల్లో చెన్నైది మూడో స్థానం. తొలి రెండు స్థానాలు ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లవి. గతేడాదితో పోల్చితే చెన్నైలో ధరలు 8.78 శాతం పెరిగాయి. ఆసక్తికరంగా అద్దెలు మాత్రం 1.7 శాతం మేర పడిపోయాయి.
 ఏడాదికి రూ.20 లక్షల ఆదాయం గడించేవారికి మాత్రమే చెన్నైలో స్థిరాస్తి సొంతమవుతుంది.

ఢిల్లీ–ఎన్‌సీఆర్‌..
   దేశ రాజధానిలో స్థిరాస్తి ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. నివాస సముదాయాల ధరలు విషయంలో ఢిల్లీది
రెండో స్థానం.  
  గత నాలుగేళ్లుగా రాజధానిలో నివాస, వాణిజ్య సముదాయాల అద్దెలు 20 శాతం పెరిగాయి. ఇదే సమయంలో స్థిరాస్తి కొనుగోలు ధరలైతే 9.1 శాతం మేర పెరిగాయి.
 ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో స్థిరాస్తిని కొనుగోలు చేయాలంటే ఏటా ఆదాయం కనీసం రూ.25 లక్షలకు పైగానే ఆర్జించాలి మరి.

కోల్‌కతా..
 స్థిరాస్తి కొనుగోలుౖకైనా, అద్దె విషయంలోనైనా కోల్‌కత్తా సమాంతరంగా వృద్ధి చెందుతుంది.
 ఏడాదికాలంగా ఇక్కడ స్థిరాస్తి ధరలు 11.27 శాతం, అద్దెలు 11.48 శాతం మేర పెరిగాయి.
ఏటా ఆదాయం రూ.15 లక్షలుంటే కోల్‌కతాలో ప్రాపర్టీ కొనుగోలు చేయవచ్చు.

అహ్మదాబాద్‌..
 హైదరాబాద్‌ తర్వాత స్థిరాస్తి కొనుగోలుౖకైనా, అద్దెకైనా సామాన్యులకు అందుబాటులో ఉన్న నగరమేదైనా ఉందంటే అది అహ్మదాబాదే.
 ఏటా ఆదాయం రూ.10 లక్షలుంటే చాలు ఇక్కడ సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు.
   

అందుబాటు గృహాల్లో యువతే కీలకం
సాక్షి, హైదరాబాద్‌: 2050 నాటికి జనాభాలోని 65 శాతం మంది 35 సంవత్సరాలకు చేరుకుంటారని.. వీళ్ల ప్రవర్తన, వ్యయ, మదింపులు, ట్రెండ్స్‌ను అర్థం చేసుకుంటేనే స్థిరాస్తి, రిటైల్‌ రంగాలు వృద్ధి చోదకాలుగా మారతాయని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్‌) జాతీయ అధ్యక్షుడు జాక్సీ షా సూచించారు. శుక్రవారమిక్కడ క్రెడాయ్‌ యూత్‌ వింగ్‌ 2వ వార్షిక కన్వెన్షన్‌ జరిగింది. ఈ సందర్భంగా యూత్‌ వింగ్, సీబీఆర్‌ఈ సంయుక్తంగా కలిసి ‘ద యూత్‌ బారోమీటర్‌’ రిపోర్ట్‌ను విడుదల చేశారు.

♦  82% మంది యువత (మిలీనియల్స్‌) తమ కుటుంబంతో నివసిస్తున్నారు. పెళ్లయ్యేంత వరకూ ఫ్యామిలీతోనే ఉండాలన్న సాంస్కృతిక బంధమే ఇందుకు కారణం. అధిక ప్రాపర్టీ ధరలు కూడా ఒకింత కారణమే. తల్లిదండ్రులతో నివ సించని 68% యువత అద్దెకు ఉండటానికి ఇష్టపడుతున్నారు. 35% యువత ఆస్తిని కొనుగోలు చేయడమనేది పెట్టుబడిగా భావిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. మొత్తమ్మీద ఎక్కువ శాతం యువత ఇంటిని కొనుగోలును లకి‡్ష్యంచినట్లు అందులోనూ నాణ్యమైన, లొకేషన్‌ ఆధారిత అందుబాటు గృహాలకు ప్రాధాన్యమిస్తున్నారు.
 మొత్తం జనాభాలో 25 శాతం మంది పని చేసే యువత ఉంటుంది. పని చేసేందుకు ఒక కంపెనీని ఎంచుకునే క్రమంలో 75% యువత ప్రాధాన్యతలు.. వేతనం, బెనిఫిట్సే! 73 శాతం మంది పని చేసే చోటు నుంచి 45 నిమిషాలకు మించి ప్రయాణించడానికి ఇష్టపడటం లేదు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top