సాక్షి,  ముంబై:  ఇప్పటి దాకా డబుల్‌సిమ్, డబుల్ కెమెరా ,డబుల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ ల హవా నడిచింది. ఇక  రెండు కెమెరాలు కాదు.. నాలుగుకెమెరాలు అంటోంది  ఓ  ప్రముఖ  మొబైల్  కంపెనీ  హువాయి.  ఈ తరహా ఆప్షన్‌తో ఆకర్షణీయమైన సరికొత్త స్టార్మ్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన నాలుగు కెమెరాల ఫీచర్‌తో  హానర్ 9ఐ పేరుతో   అందుబాటులోకి తెచ్చింది. మేకర్.  మధ్య ఒప్పో, వివో ,  అసుస్ లాంటి కంపెనీలు  సెల్ఫీ స్పెషల్ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తే.. ఇపుడు ఏకంగా  నాలుగుకెమెరాలతో వాటికి సవాల్ విసురుతోంది హువాయి.
 16 ఎంపీ , 2 ఎంపీ రియర్   కెమెరాలను ఈ డివైస్‌లో అమర్చింది. ఇకసెల్ఫీ కెమెరానికి విషయానికి 13ఎంపీ సెల్ఫీ కెమెరాతోపాటు 2 ఎంపీ  సామర్ధ్యంతో మరో  ఫ్రంట్  కెమెరాను అదనపు ఫీచర్‌గా జోడించింది. మెటల్ బాడీ డిజైన్, బెజెల్ లెస్ డిస్‌ప్లే తో రూపొందించిన  ఈస్మార్ట్‌ఫోన్ ధరను  రూ.17,999గా నిర్ణయించింది.  మూడురంగుల్లో ఇది  మార్కెట్లో లభిస్తోంది.
హానర్ 9ఐ ఫీచర్స్
5.9 డిస్‌ప్లే
2160 x 1080 పిక్సెల్స్‌రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్
4జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
256 జీబీ దాకా స్టోరేజ్‌ను  విస్తరించుకునే  అవకాశం
3340 ఎంఏహెచ్ బ్యాటరీ
 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
