భారత్లో హిటాచి ఏటీఎమ్ ల తయారీ కంపెనీ | Hitachi to roll out 'Make in India' ATMs, starts new manufacturing | Sakshi
Sakshi News home page

భారత్లో హిటాచి ఏటీఎమ్ ల తయారీ కంపెనీ

Mar 18 2016 1:18 AM | Updated on Sep 3 2017 7:59 PM

భారత్లో హిటాచి ఏటీఎమ్ ల తయారీ కంపెనీ

భారత్లో హిటాచి ఏటీఎమ్ ల తయారీ కంపెనీ

జపాన్‌కు చెందిన హిటాచి గ్రూప్ భారత్‌లో ఏటీఎమ్‌లు తయారు చేసే కంపెనీని ఏర్పాటు చేస్తోంది.

 రూ.100 కోట్లతో బెంగళూరులో ఏర్పాటు
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన హిటాచి గ్రూప్ భారత్‌లో ఏటీఎమ్‌లు తయారు చేసే కంపెనీని ఏర్పాటు చేస్తోంది. బెంగళూరులో హిటాచి టెర్మినల్ సొల్యూషన్స్ ఇండియా పేరుతో రూ. 100 కోట్లతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. దేశంలో బ్యాంక్ ఖాతాదారులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో హిటాచి గ్రూప్‌కు చెందిన హిటాచి-ఓమ్రన్ టెర్మినల్ సొల్యూషన్స్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈఏడాది జూన్‌లో ఏటీఎమ్‌ల తయారీని ప్రారంభిస్తామని, ఈ ఏడాది చివరికల్లా నెలకు 1,500 ఏటీఎమ్‌లను ఉత్పత్తి చేయగలమని హిటాచి కంపెనీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా ఈ ఏటీఎమ్‌ల తయారీ కంపెనీని ఆరంభిస్తున్నామని, ఉద్యోగ కల్పనకు, భారత ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నామని వివరించింది. 2015 కల్లా 5,000 ఏటీఎమ్‌లను భారత్‌లో ఏర్పాటు చేశామని, పేర్కొంది. కాగా భారత్‌లో ప్రస్తుతం రెండు లక్షల ఏటీఎమ్‌లు, సీడీ(క్యాష్ డిస్పెన్సింగ్ ఏటీఎమ్)లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement