హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.10,749 కోట్లు | HDFC Q2 net profit up 76 per cent at Rs 10749 crore | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.10,749 కోట్లు

Nov 5 2019 4:24 AM | Updated on Nov 5 2019 4:24 AM

HDFC Q2 net profit up 76 per cent at Rs 10749 crore - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో అతి పెద్ద నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.10,749 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో లాభం, రూ.6,097 కోట్లుతో పోల్చితే 76% వృద్ధి సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. గృహ్‌ ఫైనాన్స్‌లో వాటా విక్రయం, అనుబంధ కంపెనీల నుంచి డివిడెండ్‌ ఆదాయం బాగా పెరగడం, పన్ను భారం తగ్గడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. ఆదాయం రూ.22,951 కోట్ల నుంచి రూ.32,851 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  

18 శాతం రుణ వృద్ధి...: పన్ను భారం రూ.1,022 కోట్ల నుంచి రూ.569 కోట్లకు తగ్గింది. గత క్యూ2లో రూ.6 కోట్లుగా ఉన్న డివిడెండ్‌ ఆదాయం ఈ క్యూ2లో 186 రెట్లు ఎగసి రూ.1,074 కోట్లకు పెరిగింది. 18% రుణ వృద్ధి సాధించామని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం 16% వృద్ధితో రూ.3,078 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌లో ఎలాంటి మార్పు లేకుండా 3.3 శాతం రేంజ్‌లోనే ఉంది. స్థూల మొండి బకాయిలు సీక్వెన్షియల్‌గా 1.29% నుంచి స్వల్పంగా 1.33%కి పెరిగాయని వివరించింది. కేటాయింపులు గత క్యూ2లో రూ.890 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.754 కోట్లకు తగ్గాయని తెలిపింది.  

స్టాండ్‌అలోన్‌ లాభం...61 శాతం అప్‌....
స్టాండ్‌అలోన్‌ పరంగా నికర లాభం రూ.2,467 కోట్ల నుంచి 61 శాతం వృద్ధితో రూ.3,962 కోట్లకు పెరిగింది.  మొత్తం ఆదాయం రూ.11,257 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.13,494 కోట్లకు పెరిగింది. గృహ్‌ ఫైనాన్స్‌ కంపెనీని బంధన్‌ బ్యాంక్‌కు విక్రయించడం వల్ల రూ.1,627 కోట్ల పన్నుకు ముందు లాభాలు వచ్చాయని తెలిపింది.
 బీఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌ 2.4 శాతం లాభంతో రూ.2,181 వద్ద ముగిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement