ఆపిల్‌ను మరింత రిచ్‌గా చేస్తున్న గూగుల్‌

ఆపిల్‌ను మరింత రిచ్‌గా చేస్తున్న గూగుల్‌ - Sakshi

ఐఫోన్‌ 8 లాంచింగ్‌తో ప్రపంచంలో తొలి ట్రిలియన్‌ డాలర్‌ కంపెనీగా అవతరించబోతున్న ఆపిల్‌కు గుట్టలుగుట్టలుగా నగదు వచ్చి చేరుతోంది. సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌, ఈ టెక్‌ దిగ్గజాన్ని మరింత రిచ్‌గా చేస్తోంది. ఆపిల్‌ ఐఫోన్లు, ఐప్యాడ్‌లలో డీఫాల్ట్‌ సెర్చ్‌ ఇంజిన్‌గా గూగుల్‌నే ఉంచడానికి 3 బిలియన్‌ డాలర్లను(రూ.19,240 కోట్లను) ఈ సెర్చ్‌ ఇంజిన్‌ చెల్లించనుంది. కేవలం 3 ఏళ్లలోనే 1 బిలియన్‌ డాలర్ల నుంచి 3 బిలియన్‌ డాలర్లకు ఈ లైసెన్సింగ్‌ ఫీజును పెంచేసింది. 2014లో గూగుల్‌ వీటి కోసం 1 బిలియన్‌ డాలర్లను చెల్లించింది. ప్రస్తుతం ఇవి 3 బిలియన్‌ డాలర్లకు ఎగిశాయి. ఆపిల్‌ సర్వీసెస్‌ బిజినెస్‌లకు గూగుల్‌ నుంచే భారీ మొత్తంలో లాభాలు వస్తున్నాయి.

 

ఈ ఏడాదిలో ఆపిల్‌ మొత్తం నిర్వహణ లాభాల్లో ఇవి 5 శాతంగా ఉన్నాయని, అంతేకాక గత రెండేళ్ల నుంచి కంపెనీ నిర్వహణ లాభాల వృద్ధి 25 శాతం మేర ఉన్నట్టు బెర్న్‌స్టైయిన్‌ నిపుణుడు ఏ.ఎం సక్కోనాఘి జూనియర్‌ చెప్పారు. ఇటు ఆపిల్‌కే కాక, అటు గూగుల్‌కు మంచి ప్రయోజనాలే చేకూరుతున్నాయని పేర్కొన్నారు. గూగుల్‌ మొబైల్‌ సెర్చ్‌ రెవెన్యూల్లో 50 శాతం ఆపిల్‌ ఐఓఎస్‌ డివైజ్‌లవేనని తెలిపారు. ఆపిల్‌తో ఉన్న ఈ డీల్‌కు గూగుల్‌ గుడ్‌బై చెప్పాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందని కూడా ఈ నిపుణుడు తెలిపారు. అదేవిధంగా క్వాల్‌కామ్‌తో జరుగుతున్న యుద్ధంలో ఆపిల్‌కు ఇతర టెక్‌ దిగ్గజాలు ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌లు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి.   
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top