ఎస్‌బీఐ కస్టమర్లకు ‘కూల్‌’ న్యూస్‌

Good news for SBI customer get flat Rs1500 cashback on ACs on EMI transactions - Sakshi

సాక్షి, ముంబై  : దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌.    మండుతున్న ఎండలతో ఇబ్బందులు పడుతున్న వారికి బ్యాంకుచల్లటి కబురు చెప్పింది.   ఎస్‌బీఐ కార్డు ద్వారా   ఏసీ( ఎయిర్‌ కండిషనర్స్‌) కొనుగోలు చేసినకస్టమర్లకు  రూ.1500 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌  చేస్తోంది. పరిమిత కాల  ఆఫర్‌గా అందిస్తున్న ఈ అవకాశం  మే 30వ తేదీవరకు మాత్రమే అందుబాటులో ఉంది.

అయితే 1,500 రూపాయల చొప్పున క్యాష్‌బ్యాక్‌  పొందాలంటే 3 నెలల, 6 నెలల, లేదా 9 నెలలు ఈఎమ్ఐలు పై వర్తిస్తుంది. అలాగే కనిష్ట ఆర్డర్ విలువ రూ.20వేలు ఉండాలి. అలాగే పెద్ద పెద్ద లేదా ఎంపిక చేసిన ఎలక్ట్రానిక్ షాపుల్లో మాత్రమే  లభ్యం.  ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ లార్జ్ ఫార్మాట్ ఎలక్ట్రానిక్ చైన్, జనరల్ ట్రేడ్ మర్చంట్ ఔట్‌లెట్‌లలో లభిస్తుంది.  అందుకే ముందే  క్యాష్‌బ్యాక్‌ వర్తిస్తుందా లేదా అనేది తమ వినియోగదారులు ముందే నిర్ధారించుకోవాల్సి ఉంటుందని బ్యాంకుకోరింది. ఈ  క్యాష్ బ్యాక్ ఆగష్టు 30, 2019 నాటికి  వినియోగదారును ఖాతాలో జమ చేయబడుతుంది. బ్రాండ్ ఈఎంఐ ఆప్షన్ కింద పిన్‌ల్యాబ్స్ స్విప్ మిషన్ ట్రాన్సాక్షన్ ద్వారా మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. చార్జ్ స్లిప్‌లో రూ.1,500 క్యాష్ బ్యాక్ అని కచ్చింగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది.  

ఎస్‌బీఐ కార్డు 3, 6, 9, 12 నెలల కాలపరిమితికి 14 శాతం వడ్డీని, 18 నెలలు, 24 నెలల కాలపరిమితికి 15 శాతం వడ్డీని విధిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top