ఏపీలో ఫాక్స్‌కాన్‌ మరిన్ని పెట్టుబడులు

Foxconn India Head meets CM Ys Jagan - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి వివరించిన ఫాక్స్‌కాన్‌ ఇండియా ఎండీ

స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో భాగస్వాములవ్వాలని కోరిన సీఎం

సాక్షి, అమరావతి: ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ ఇండియా శ్రీ సిటీలోని యూనిట్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం శ్రీ సిటీ యూనిట్‌ ద్వారా సుమారుగా 15 వేల మంది మహిళలకు ఉపాధి కలి్పస్తున్నామని, త్వరలోనే ఈ యూనిట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఫాక్స్‌కాన్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ జోష్‌ ఫాల్గర్‌ తెలిపారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో సమావేశమైన తరువాత రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. స్థానికులకు ఉపాధి కలి్పంచే విధంగా వారందరికీ వృత్తిపరమైన శిక్షణ ఇచ్చామని, ప్రస్తుతం నెలకు 35 లక్షలకు పైగా మొబైల్స్‌ను విక్రయిస్తున్నట్లు తెలిపారు.

స్కిల్‌డెవలప్‌మెంట్‌లో భాగస్వామ్యం కండి
ఎల్రక్టానిక్స్‌ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా రాష్ట్రాన్ని ఎల్రక్టానిక్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని, ఇందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారముంటుందన్నారు. రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించడానికి మానవ వనరులను అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ కార్యక్రమంలో ఫాక్స్‌కాన్‌ భాగస్వామ్యం కావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. ఉత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయడానికి అత్యుత్తమ ప్రమాణాలతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని, మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కలి్పంచడమే దీని ఉద్దేశమని వెల్లడించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top