ఎయిర్‌టెల్‌కు భారీ షాక్‌

Foreign Trade Regulator Puts Airtel On Denied Entry List says Report - Sakshi

ఎయిర్‌టెల్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టిన డీజీఎఫ్‌టీ 

సాక్షి, న్యూఢిల్లీ: భారీ నష్టాలకు తోడు ఇటీవలి ఏజీఆర్‌ వివాదంతో  ఇబ్బందులు పడుతున్న ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎక్స్‌పోర్ట్‌ ఆబ్లిగేషన్స్‌కు అనుగుణంగా ప్రవర్తించలేదన్న ఆరోపణలతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ భారతి ఎయిర్‌టెల్‌ను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎగుమతుల ప్రోత్సాహక పథకాల (ఇపీసీజీ) పథకం కింద ఎగుమతి నిబంధలను నెరవేర్చకపోవడంతో భారతి ఎయిర్‌టెల్‌ను విదేశీ వాణిజ్య రెగ్యులేటరీ  ఈ జాబితాలో  చేరింది.

ఎగుమతి ప్రోత్సాహక మూలధన వస్తువుల పథకం కింద ఎగుమతి బాధ్యతను నెరవేర్చడంలో ఎయిర్‌టెల్ విఫలమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్‌టెల్‌ను "తిరస్కరించిన ఎంట్రీ లిస్ట్" లో ఉంచినట్లు తెలిపాయి. దీంతో కంపెనీలు తమ దిగుమతి లైసెన్స్‌ను కోల్పోతాయి. మరోవైపు అవసరం లేని కారణ​గా 2018 ఏప్రిల్ నుండి అలాంటి లైసెన్స్ తీసుకోలేదని ఎయిర్‌టెల్‌ వివరించింది. అయినప్పటికీ గత లైసెన్సులన్నీ ముగిసిన నేపథ్యంలో  కొత్త లెసెన్స్‌ కోసం  ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నామని తెలిపింది. అయితే ఏ వస్తువులు (ఎగుమతి, దిగుమతి) ఈ లైసెన్సుల కిందికి వస్తాయనేది వెల్లడించలేదు  ఈపీసీజీ పథకం కింద, ఎగుమతిదారుడు కొంతవరకు కేపిటల్ గూడ్స్‌ను సుంకాలేవీ లేకుండానే దిగుమతి చేసుకునే వీలుంటుంది. అలాగే ఎగుమతులకు సంబంధించిన ప్రక్రియలో సాంకేతికతను పెంచుకోవడం కోసం అవసరమైన పరికరాలను దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంది. కాగా 2020 నుంచి 2025 వరకు ఐదేళ్లపాటు అమలులో ఉండేలా కొత్త వాణిజ్య విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా కసరత్తును  చేస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top