విద్యుత్‌ వెలుగులు దేశవ్యాప్తం!

Electricity in villages - Sakshi

మార్చికల్లా అన్ని గ్రామాలకు

ఆర్‌ఈసీ సీఎండీ పి.వి.రమేశ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మార్చినాటికి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ విద్యుత్‌ వెలుగులుంటాయని రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ సీఎండీ పి.వి.రమేశ్‌ వెల్లడించారు. ‘2015 ఆగస్టు 15 నాటికి విద్యుత్‌ సరఫరా లేని గ్రామాలు 18,458 ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 1,227కు తగ్గింది. 2018 మే 1 కల్లా ప్రతి గ్రామంలో విద్యుత్‌ వెలుగులుండాలనేది కేంద్రం లక్ష్యం.

ఈ లక్ష్యం మార్చి 31కల్లా నెరవేరనుంది. ఇందుకు ప్రభుత్వం రూ.45,000 కోట్లు కేటాయిం చింది’ అని వివరించారు. విద్యుదీకరణ ప్రాజెక్టులకు ఇప్పటికే ఆర్‌ఈసీ విదేశీ మార్కెట్ల నుంచి రూ.4,220 కోట్ల దాకా సమీకరించింది. మరోమారు నిధులను సమీకరించనున్నట్టు రమేశ్‌ వెల్లడించారు. ఈ మొత్తం రూ.2,000–3,250 కోట్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 31లోగా రూ.9,750 కోట్ల దాకా సమీకరించేందుకు ఆర్‌బీఐ నుంచి ఆర్‌ఈసీకి అనుమతి ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top