ఐషర్‌ మోటార్స్‌ లాభం 22% డౌన్‌

Eicher Motors Profits 22 Percent Down - Sakshi

బుల్లెట్‌ బైక్‌ల అమ్మకాలు 19% డౌన్‌

న్యూఢిల్లీ: ఐషర్‌ మోటార్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.452 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో ఆర్జించిన నికర లాభం రూ.576 కోట్లతో పోల్చితే 22 శాతం క్షీణించిందని ఐషర్‌ మోటార్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,548 కోట్ల నుంచి 7% తగ్గి రూ.2,382  కోట్లకు చేరిందని కంపెనీ ఎమ్‌డీ సిద్ధార్థ లాల్‌ తెలిపారు. గత క్యూ1లో 2.25 లక్షలు అమ్ముడైన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాలు ఈ క్యూ1లో 19 శాతం క్షీణించి 1.81 లక్షలకు తగ్గాయని పేర్కొన్నారు. బీఎస్‌ సిక్స్‌ నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానుండటంతో ముందస్తు కొనుగోళ్లు జరిగే అవకాశాలుండటం, పండుగల సీజన్‌ కానుండటంతో ఈ సెప్టెంబర్‌ నుంచి అమ్మకాలు పుంజుకోగలవన్న ఆశాభావాన్నివ్యక్తం చేశారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top