నిలిచిపోనున్న ఇండిగో పాత విమానాలు

DGCA asks IndiGo to replace old faulty A320neo plane - Sakshi

డీజీసీఏ తాజా ఆదేశాలు

న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో తన పాత విమానాలకు స్వస్తి పలకాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి కొత్త ‘ఏ 320 నియో’ విమానానికి.. అన్‌మోడిఫైడ్‌ ప్రాట్‌ అండ్‌ విట్నీ (పీడబ్ల్యూ) ఇంజన్లను కలిగిన పాత విమానాలను నిలుపుచేయాల్సి ఉంటుందని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) తాజాగా ఆదేశించింది. ఇక వచ్చే ఏడాది జనవరి 31 నాటికి మొత్తం 97 ఏ 320 నియో విమానాల్లో పీడబ్ల్యూ ఇంజిన్లను మార్చాల్సిందేనని ఇటీవలే డీజీసీఏ ఆదేశించిన విషయం తెలిసిందే. గడువుతేదీ లోపు మార్చకపోతే వీటిని నిలిపివేయాల్సి ఉంటుందని పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top