డెరివేటివ్‌ ఇన్వెస్టింగ్‌ లాభదాయకమా? | Derivative Investing | Sakshi
Sakshi News home page

డెరివేటివ్‌ ఇన్వెస్టింగ్‌ లాభదాయకమా?

May 15 2017 12:22 AM | Updated on Sep 5 2017 11:09 AM

డెరివేటివ్‌ ఇన్వెస్టింగ్‌ లాభదాయకమా?

డెరివేటివ్‌ ఇన్వెస్టింగ్‌ లాభదాయకమా?

స్టాక్‌మార్కెట్‌పై అవగాహన ఉన్నవారికి డెరివేటివ్స్‌ గురించి తెలిసే ఉంటుంది. క్యాష్‌ మార్కెట్‌లో స్టాక్స్‌ను కొంటే అవి రెండు రోజుల్లో మన డీమ్యాట్‌ ఖాతాలోకి వచ్చి చేరుతాయి.

స్టాక్‌మార్కెట్‌పై అవగాహన ఉన్నవారికి డెరివేటివ్స్‌ గురించి తెలిసే ఉంటుంది. క్యాష్‌ మార్కెట్‌లో స్టాక్స్‌ను కొంటే అవి రెండు రోజుల్లో మన డీమ్యాట్‌ ఖాతాలోకి వచ్చి చేరుతాయి. కానీ డెరివేటివ్స్‌లో అలా కాదు. ఇక్కడ డైరెక్ట్‌గా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయం. కాంట్రాక్ట్స్‌ నడుస్తాయి. వీటికి నిర్ణీత (నెల, త్రైమాసికం) గడువు ఉం టుంది. డెరివేటివ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేవారి పెట్టుబడుల విలువ అసెట్‌ ధరపై ఆధారపడి ఉం టుంది. ఇక్కడ అసెట్‌ అనేది స్టాక్, కమోడిటీ, కరెన్సీ కావొచ్చు. కాగా డెరివేటివ్స్‌లో ఫ్యూ చర్స్, ఆప్షన్స్‌ అనే రెండు విభాగాలుంటాయి.

భవిష్యత్‌లో నిర్ణీత సమయంలో పలానా ధరలకు ఒక అసెట్‌ కొనుగోలు/అమ్మకానికి సంబంధించి రెండు పార్టీల మధ్య కుదిరే ఒప్పందాన్నే ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌ అని చెప్పుకోవచ్చు. అంటే కాంట్రాక్ట్‌ను కొన్నామంటే.. ఆ అసెట్‌ ధరను నిర్దేశించుకున్న సమయంలో విక్రయదారుడికి చెల్లించేయాలి. అదే కాంట్రాక్ట్‌ను అమ్మితే.. ఆ అసెట్‌ను కొనుగోలుదారుడికి నిర్దేశించుకున్న కాలంలోగా ఇచ్చేయాలి. స్టాక్‌ ధర సాధారణంగా స్పాట్‌ మార్కెట్‌లో కన్నా ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో ఎక్కువగా ఉంటుంది. స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌కు మార్జిన్‌ను చెల్లించడం ద్వారా కాంట్రాక్ట్‌లోకి ఎంటర్‌ అవుతాం. అసెట్‌ విలువ మార్పుపై మార్జిన్‌ చెల్లింపు ఆధారపడి ఉంటుంది. ఇక ఆప్షన్స్‌ విషయానికి వస్తే.. ఇక్కడ మార్జిన్‌ చెల్లింపులు ఉండవు. ప్రీమియం చెల్లించడం ద్వారా ఆప్షన్‌ను సొంతం చేసుకుంటాం.

పోర్ట్‌ఫోలియో హెడ్జింగ్‌ కోసం డెరివేటివ్స్‌ వైపు వెళ్లాలి. అంతేకానీ లాభాల కోసం ఆలోచించకూడదు. మార్కెట్‌ తీవ్ర ఒడిదుడుకులలో ఉన్నప్పుడు రిస్క్‌ను మేనేజ్‌ చేయడానికి డెరివేటివ్స్‌ను ఉపయోగించుకోవాలి. లాభాల కోసం వెళితే అసలుకే ముప్పు రావొచ్చు. డెరివేటివ్స్‌లో ఏ మేర లాభాలు వస్తాయో.. అదే స్థాయిలో నష్టాలు కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement