ఢిల్లీ-హైదరాబాద్ రూట్‌లో మార్చి 1 నుంచి విస్తార సర్వీసులు | Delhi-Mumbai route Expanded Services from March 1 | Sakshi
Sakshi News home page

ఢిల్లీ-హైదరాబాద్ రూట్‌లో మార్చి 1 నుంచి విస్తార సర్వీసులు

Jan 24 2015 12:39 AM | Updated on Oct 2 2018 7:37 PM

ఢిల్లీ-హైదరాబాద్ రూట్‌లో  మార్చి 1 నుంచి విస్తార సర్వీసులు - Sakshi

ఢిల్లీ-హైదరాబాద్ రూట్‌లో మార్చి 1 నుంచి విస్తార సర్వీసులు

విస్తార ఎయిర్‌లైన్స్ తన విమాన సర్వీసులను విస్తరిస్తోంది.

న్యూఢిల్లీ: విస్తార ఎయిర్‌లైన్స్ తన విమాన సర్వీసులను విస్తరిస్తోంది.  మార్చి 1 నుంచి ఢిల్లీ-హైదరాబాద్ రూట్‌లో రోజుకు రెండు విమాన సర్వీసులను నడపనున్నామని విస్తార సీఈఓ ఫీ టీక్ యో పేర్కొన్నారు. అలాగే వచ్చే నెల 20 నుంచి గోవాకు విమాన సర్వీసులను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కంపెనీ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌ల నుంచి విమాన సర్వీసులను ఈ నెల నుంచే ప్రారంభించింది. ప్రస్తుతం వారానికి 68 సర్వీసులను నడుపుతున్నామని, వీటిని 164కు పెంచనున్నామని యో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ మూడు ఎయిర్‌బస్ 320 విమానాలను నడుపుతోంది. మార్చి కల్లా ఈ సంఖ్యను ఐదుకు పెంచనున్నది.
 
జెట్ ఎయిర్‌వేస్ రిపబ్లిక్ డే ఆఫర్లు


న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ తన గల్ఫ్ భాగస్వామి ఎతిహద్‌తో కలిసి రిపబ్లిక్ డే సందర్భంగా విమాన చార్జీల్లో డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. శనివారం నుంచి 3 రోజులపాటు  టికెట్ ధరల్లో 25% డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ టికెట్లతో దేశీయ రూట్లలో మార్చి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు, అంతర్జాతీయ రూట్లలో ఫిబ్రవరి 1 నుంచి ప్రయాణించవచ్చని పేర్కొంది.ఈ ఆఫర్లు ఇండియా నుంచి యూఎస్, యూరప్, మధ్య తూర్పు ప్రాంతాలకు ఉన్న ఎతిహద్ విమాన సర్వీసులకు కూడా వర్తిస్తాయని తెలిపింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement