సైయంట్ రెండో మధ్యంతర డివిడెండ్ | Sakshi
Sakshi News home page

సైయంట్ రెండో మధ్యంతర డివిడెండ్

Published Fri, Mar 18 2016 1:03 AM

సైయంట్ రెండో మధ్యంతర డివిడెండ్

రూ.5 ముఖ విలువ ఉన్న ఒక్కో షేర్‌కు రూ.4
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ సైయంట్ రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.5 ముఖ విలువ ఉన్న ఒకో షేర్‌కు రూ.4 మధ్యంతర డివిడెండ్(80 శాతం)ను ఇస్తామని కంపెనీ పేర్కొంది. గురువారం జరిగిన డెరైక్టర్ల బోర్డ్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. కాగా తొలి మధ్యంతర డివిడెండ్‌ను గత ఏడాది అక్టోబర్‌లో ఒక్కో షేర్‌కు రూ.3 చొప్పున ప్రకటించింది. గురువారం బీఎస్‌ఈలో సైయంట్ షేర్ 1.8 శాతం లాభంతో రూ.421 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement