0.9 శాతానికి తగ్గిన కరెంటు ఖాతా లోటు

 Current Account Deficit Shrinks To 0.9 Percent Of GDP In July AND September Quarter - Sakshi

ముంబై: జీడీపీలో కరెంటు ఖాతా లోటు (క్యాడ్‌) సెప్టెంబర్ త్రైమాసికంలో 0.9 శాతానికి (6.3 బిలియన్‌ డాలర్లు) తగ్గినట్టు ఆర్‌బీఐ తెలిపింది. 2018–19 ఆరి్థక సంవత్సరంలో ఇదే కాలానికి క్యాడ్‌ 2.9 శాతంగా ఉండడం గమనార్హం. విదేశీ మారకం రూపంలో నిధుల రాక, పోకల మధ్య అంతరాన్ని క్యాడ్‌గా పేర్కొంటారు. వాణిజ్య లోటు తక్కువగా 38.1 బిలియన్‌ డాలర్లుగా ఉండడమే క్యాడ్‌ తగ్గేందుకు తోడ్పడినట్టు ఆర్‌బీఐ తెలిపింది. మరి క్రితం ఏడాది ఇదే కాలానికి వాణిజ్య లోటు 50 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఇక ప్రస్తుత ఆరి్థక సంవత్సరం తొలి అర్ధ భాగానికి (ఏప్రిల్‌–సెపె్టంబర్‌) క్యాడ్‌ జీడీపీలో 1.5 శాతంగా నమోదైంది. అంతక్రితం ఇదే కాలంలో 2.6 శాతంగా ఉంది. నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) సెపె్టంబర్‌ క్వార్టర్లో 7.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం తొలి ఆరు నెలల్లో నికర ఎఫ్‌డీఐలు 21.2 బిలియన్‌ డాలర్లుగా, పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు 7.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top