కార్పొరేషన్ బ్యాంక్‌కు మొండి బకాయిల భారం | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్ బ్యాంక్‌కు మొండి బకాయిల భారం

Published Sat, Aug 8 2015 12:51 AM

Corporation Bank to the burden of bad loans

న్యూఢిల్లీ : కార్పొరేషన్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 12 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.231 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.204 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొండి బకాయిలకు అధిక  కేటాయింపుల కారణంగా నికర లాభం తగ్గిందని బ్యాంక్ పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం రూ.5,215 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.5,335 కోట్లకు పెరిగింది. మొండి బకాయిలకు, కంటింజెన్సీలకు కేటాయింపులు రూ.459 కోట్ల నుంచి 35 శాతం వృద్ధితో రూ.621 కోట్లకు పెరిగాయి.

స్థూల మొండి బకాయిలు 3.96 శాతం నుంచి 5.43 శాతానికి పెరగ్గా,  నికర మొండి బకాయిలు మాత్రం 3.71 శాతం నుంచి 3.55 శాతానికి తగ్గాయని బ్యాంకు వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కార్పొరేషన్ బ్యాంక్ షేర్ 0.4 శాతం వృద్ధితో రూ.54కు పెరిగింది.
 

Advertisement
Advertisement