Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

A series of attacks provoked TDP ranks
పల్నాడుపై పగబట్టిన బాబు

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి/ సాక్షి, నరసరావుపేట : తెలుగు­దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నాయకులు పల్నాడుపై పగపట్టారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా జరు­గుతున్న వరుస పరిణామాలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. రాజకీయంగా వరుసగా చా­వు దెబ్బ తింటున్న తెలుగుదేశం ఎలాగైనా పల్నా­డులో ఫ్యాక్షనిజాన్ని ఎగదోసి, వర్గ వైషమ్యాలను పెంచి పోషించడం ద్వారా తన ఉనికిని నిలబెట్టుకునేందుకు శతధా ప్రయత్నిస్తోంది.అందులో భాగంగా వరుస దాడులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మా­చర్ల, గురజాల నియోజకవర్గాలకు పల్నాడు ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. మాచర్ల నియోజకవర్గం నుంచి 1999లో టీడీపీ తరఫున పోటీ చేసిన జూలకంటి దుర్గాంబ గెలుపొందారు. 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి గెలుపొందారు. 2009, 2012 (ఉప ఎన్నిక), 2014, 2019 ఎన్నికల్లో వరుసగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తున్నారు. కాగా దుర్గాంబ కుమారుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో మాచర్లలో సైకిల్‌ మూలన పడింది. మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్ని­కల్లోనూ టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. టీడీపీ బలోపేతమంటూ...మాచర్లలో టీడీపీని బలోపేతం చేయాలంటే పిన్నెల్లిని అడ్డు తొలగించడమే మార్గం అని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు.. అందుకు అనుగుణంగా దాడుల ప్రణాళిక రచించారు. అందులో భాగంగా 2020 జనవరి ఏడో తేదీన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మంగళగిరికి సమీపంలోని కాజ టోల్‌ప్లాజా వద్ద టీడీపీ శ్రేణులతో భారీ ఎత్తున దాడి చేయించారు. ఎమ్మెల్యే వాహనాన్ని రాళ్లతో ధ్వంసం చేశారు. గన్‌మెన్‌ గాయాలపాలయ్యారు. అయితే ఆ రోజు ఎమ్మెల్యే బయటపడ్డారు. ఆ క్రమంలో భాగంగా రౌడీలు, గూండాలనే గుర్తింపున్న బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నలకు మందీ మార్భలాన్ని తోడిచ్చి విజయవాడ నుంచి 2020 మార్చి 11న మాచర్లకు పంపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు, స్థానికులు తిరగబడి బొండా, బుద్దా బృందాలను వెంటపడి తరిమేశారు. దీంతో చంద్రబాబు.. ఫ్యాక్షనిజం, హత్యల నేపథ్యమున్న జూలకంటి బ్రహ్మానందరెడ్డిని మళ్లీ రంగంలోకి దింపుతూ 2021 డిసెంబర్‌లో మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు. 2010 మార్చి పదో తేదీన ఆత్మకూరు వద్ద ఏడుగురి హత్య కేసులో జూలకంటి ప్రథమ ముద్దాయి. చివరకు తన బాబాయి కుమారుడైన సాంబిరెడ్డి పొలాల్లో దాక్కుని ఉండగా హత్య చేయించారని అందరూ చెప్పుకుంటారు. పోలేపల్లి శివారెడ్డి హత్య కేసులోనూ జూలకంటిది ప్రధాన పాత్ర అని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. మాచర్ల ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసు­కున్నప్పటి నుంచి వరుస దాడులు, దొమ్మీలు, హత్యా ప్రయత్నాల పరంపర కొనసాగుతోంది. ఈ ఎన్నికల తర్వాత అది శ్రుతి మించింది. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై విచ్చలవిడిగా టీడీపీ దాడులు కొనసాగు­తున్నాయి. వినుకొండ, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజక­వ­ర్గాల్లోనూ టీడీపీ దాడులకు తెగబడింది. మాచర్ల నియోజకవర్గంలో అశాంతికి ప్రధాన కారణం పోలీ­సు­లేనని, ప్రధానంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్, కారంపూడి సీఐ నారాయణస్వామి తీరు వల్లే గొడవలు పెరి­గాయని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బహిరంగా నిప్పులు చెరగడం పల్నాడులో పరిస్థితికి అద్దం పడుతోంది. పదుల సంఖ్యలో ఊళ్లలో విధ్వంసం» మాచర్ల రూరల్‌ మండలంలోని కొత్తూరు, కంబంపాడు, భైరవునిపాడు, వెల్దుర్తి మండలం లోయపల్లి, వెల్దుర్తి, వజ్రాలపాడు, గొట్టిపాడు, నర్సంపేట, రెంటచింతల మండలం రెంటాల, జెట్టిపాలెం, పాలవాయిగేటు, గోలి, మిట్టగుడిపాడు, కారంపూడి మండలం ఒప్పిచర్ల, కారంపూడి, పేటసన్నెగండ్ల, చింతపల్లి, దుర్గి మండలం ముటుకూరు, అడిగొప్పల, పోలేపల్లి తదితర గ్రామాల్లో టీడీపీ దాడులు కొనసాగాయి.» దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల మండలాల్లోని కేశానుపల్లి, మాదినపాడు, ఇరిగేపల్లి, తంగెడ, కొత్తగణేశునిపాడు, బ్రాహ్మణపల్లి, పెద అగ్రహారం, జానపాడు, వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల, రెడ్డికొత్తూరు, బొల్లాపల్లి, కొచ్చర్ల, గంటావారిపాలెం, సత్తెనపల్లి నియోజకవర్గంలోని పాకాలపాడు, మాదల, తొండపి, చాగంటివారిపాలెం, నార్నెపాడు, గణపవరం, చీమలమర్రి, రూపెనగుంట్ల, గుండ్లపల్లి, కుంకలగుంట, చేజర్లలోనూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు చేశారు.» నరసరావుపేట టౌన్, దొండపాడు, పమిడిపాడు, పెదకూరపాడు మండలం యర్రబాలెం, లగడపాడు, చండ్రాజుపాలెం, మాదిపాడు, చిలకలూరిపేటలోని అప్పాపురం గ్రామాల్లో టీడీపీ దాడులకు తెగబడింది. అభివృద్ధిలో పోటీ పడలేకే విధ్వంసంచంద్రబాబు ఏలుబడిలో అభివృద్ధి ఊసే లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పల్నాడులో అభివృద్ధి పరుగెత్తుతోంది. నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటైంది. పిడుగురాళ్లలో మెడికల్‌ కాలేజీ రూపు దిద్దుకుంటోంది. వరికపూడిసెలకు మోక్షం కలిగింది. గురజాల నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో తాగునీటి వసతి కలిగింది.నరసరావుపేటలో జేఎన్‌టీయూ కాలేజీకి శాశ్వత భవనాలు ఒనగూరాయి. రొంపిచర్ల, మాచ­ర్లలో కేంద్రీయ విద్యాలయాలు మంజూర­య్యాయి. పులిచింతల ప్రాజెక్టు దిగువన మాదిపాడు వద్ద వంతెన నిర్మాణ పనులు ఆరంభమయ్యాయి. తద్వారా అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, గుంటూరు వరకు, మరోవైపు జగ్గయ్యపేటకు రవాణా వసతి మెరుగు పడనుంది.కొండమోడు–పేరేచర్ల, సాగర్‌– దావుపల్లి, మాచర్ల– దాచేపల్లి, నకరికల్లు–వాడరేవు జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని గ్రహించిన చంద్రబాబు.. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి గొడవలు చేయిస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Daily Horoscope 18th May 2024 In Telugu
ఈ రాశివారికి వ్యవహారాలలో విజయం.. పనుల్లో విజయం..!

మేషం.. కొత్త విషయాలు తెలుస్తాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు.వృషభం.. మిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. శ్రమ కొంత పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.మిథునం.. కొన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. ఆలయ దర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు పనిభారం.కర్కాటకం.. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. పనుల్లో విజయం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.సింహం.. పనుల్లో తొందరపాటు వద్దు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని అవాంతరాలు.కన్య.. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.తుల.. మిత్రులు, బంధువులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత వ్యతిరేక పరిస్థితులు.వృశ్చికం.. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.ధనుస్సు.. కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఊహించని ధనలబ్ధి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.మకరం.. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. సన్నిహితులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.కుంభం.. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో మరింత ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.మీనం.. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. ప్రముఖుల నుంచి శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి ఉంటుంది.

4 percent reservation for Muslims in 2004
కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం!

ఒకే ఒక్క నిర్ణయం...ఇంతమంది జీవితాల్లో ఇంత అద్భుతమైన మార్పు తెస్తుందని ఎవరూ ఊహించరు...దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ పేదరికంలో ఉన్న ముస్లింల వేదనలకు చలించిపోయి, వారి ఎదుగుదలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు...అంతే..ఆ ఒక్క నిర్ణయం ముస్లిం సమాజంలో విద్యావంతులను అమాంతంగా పెంచింది... వారిలో అనేకులు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఎదుగుతున్నారు.ఇతరత్రా అనేక ఉపాధి కోర్సుల్లో ముస్లిం యువత ప్రతిభను చూపించి, మున్ముందుకు దూసుకుపోతోంది...ఒక సాధారణ టీవీ మెకానిక్‌ తన ఇద్దరు కుమార్తెలను, ఒక కుమారుణ్ని డాక్టర్లను చేశారంటే అది వారికి లభించిన రిజర్వేషన్‌ ఫలితమే... మరెన్నో ముస్లిం పేద కుటుంబాల్లో యువతీయువకులు నేడు ఉన్నత విద్యావంతులై... తమ కుటుంబాలకు..సమాజానికి గుర్తింపును తెస్తున్నారు.. ఇలాంటి మంచి వాతావరణాన్ని కలుషితం చేసేలా బీజేపీ ముస్లింలకు రిజర్వేషన్లను తొలగిస్తామని ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించడం ఆ సమాజంలో అలజడి రేపుతోంది... రేపటి తమ భవిష్యత్తును తలచుకుని ముస్లింలు తల్లడిల్లుతున్నారు.. యిర్రింకి ఉమామహేశ్వరరావు, సాక్షి, అమరావతి: కడపలో డాక్టర్‌ నూరీ పర్వీన్‌ పేరు తెలియని వారుండరు. కడప పెద దర్గా సెంటర్‌లో కేవలం రూ.10కే వైద్య సేవలు అందించే పది రూపాయల డాక్టర్‌గా ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారామె. దివంగత మహానేత వైఎస్సార్‌ కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లతో ఎంబీబీఎస్‌ చదువుకున్న ఆమె ఆయన స్ఫూర్తితో పది రూపాయలకే వైద్యం చేయడం ప్రారంభించారు.ఆమెతో పాటు సోదరి రీనా పర్వీన్, తమ్ముడు బాబా మొహిద్దీన్‌లూ డాక్టర్లే. వీరి తండ్రి ఎండీ మక్బూల్‌ విజయవాడలో ఓ టీవీ మెకానిక్‌. తమ పేద కుటుంబం నుంచి ఏకంగా వరుసగా...ముగ్గురు డాక్టర్లుగా ఎదగడం దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ పుణ్యమేనని మక్బూల్‌ సంతోషంగా చెబుతారు. విజయవాడలో కనీసం సొంత ఇల్లయినా లేని మక్బూల్‌ టీవీ మెకానిక్‌గా కుటుంబాన్ని పోషించడమే కష్టతరంగా ఉండేది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో వైఎస్సార్‌ ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్‌ ఫలితంగా ఆయన ఇద్దరు కుమార్తెలు, కుమారుడు 2010, 2011, 2012 సంవత్సరాల్లో వరుసగా ఎంబీబీఎస్‌ సీట్లు సాధించడం ఓ అరుదైన ఘనత. ...వీరే కాదు.. దివంగత మహానేత వైఎస్సార్‌ కల్పించిన నాలుగు శాతం (బీసీ–ఇ) రిజర్వేషన్‌ రాష్ట్రంలో వేలాది ముస్లిం కుటుంబాల స్థితిగతులనే మార్చేసింది. సామాజికంగా, విద్య పరంగా అత్యంత వెనుకబాటుకు గురైన ముస్లిం సమాజాన్ని గుర్తించి వారిని ముందుకు నడిపించేందుకు వైఎస్సార్‌ తీసుకున్న రిజర్వేషన్‌ కేటాయింపు నిర్ణయం ఎన్నో ముస్లిం కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంది. ఆ కుటుంబాల్లో యువతను విద్యాధికులను చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో వైఎస్సార్‌ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్‌ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వేలాది మంది ముస్లిం యువతకు భరోసా ఇచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం ఒక్క ఏపీలోనే ఈ పదేళ్లలో వైద్య విద్యా కోర్సుల్లో 6,401 మందికి అండర్‌ గ్రాడ్యుయేషన్, 1,164 మందికి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ అవకాశాలు దక్కడం విశేషం. వైద్య విద్యా కోర్సులతో పాటు ఇంజనీరింగ్, ఇతర కోర్సుల్లో అవకాశాలు దక్కినవారు లెక్కలు మిక్కిలి ఉన్నారు. విజయవాడకు చెందిన డాక్టర్‌ అస్మా తన్విర్‌రిజర్వేషన్‌ అవకాశంతో పిన్నమనేని సిద్ధార్థ మెడికల్‌ కాలేజీలో 2014లో ఎంబీబీఎస్, ఆ తర్వాత 2019లో జనరల్‌ సర్జన్‌ (ఎంఎస్‌) వైద్య విద్య సీట్లు సాధించారు. ప్రస్తుతం డాక్టర్‌ వృత్తిని కొనసాగిస్తున్నారామె. ఆమె తండ్రి షేక్‌ కలీముద్దీన్‌ రిటైర్డ్‌ ఉద్యోగి. పిల్లల చదువులు తనకు భారమైనప్పటికీ రిజర్వేషన్‌ అవకాశంతో ఒక కుమార్తె డాక్టర్, ఇద్దరు కుమార్తెలు ఇంజనీరింగ్, కుమారులు వేర్వేరు కోర్సులను పూర్తి చేయడంతో ఆ కుటుంబం ఉన్నతంగా జీవిస్తోంది. వైఎస్సార్‌ హామీ ఇచ్చి అమలు చేశారు ముస్లిం రిజర్వేషన్లపై 2009 ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన వైఎస్సార్‌ అధికారం చేపట్టిన వెంటనే అమలు చేశారు. తొలుత ఐదు శాతం ప్రకటించినప్పటికీ 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదని సుప్రీం కోర్టు అభ్యంతరంతో నాలుగు శాతం అమలు చేశారు. వైఎస్సార్‌ ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా మంది ముస్లిం యువకులు, విద్యార్ధులు లబ్ధి పొందుతున్నారు. తమకు అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వీరంతా తమలోని ప్రతిభను నిరూపించుకుంటున్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, డీఎస్పీలు, ఆర్డీవోలు, టీచర్‌లుగా ఉద్యోగాలు పొందుతున్నారు. ఈ సంతోషాన్ని హరించే కుట్రలో భాగంగా... వైఎస్సార్‌ కల్పించిన రిజర్వేషన్లను తొలగించడానికి కూటమి కుట్రలు చేస్తోంది. ముస్లింలలోని నిమ్న కులాల వారికి సమాజంలో ఉన్న సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు కారణంగా రిజర్వేషన్లు అందుతున్నాయి. – అసదుద్దీన్‌ ఒవైసీ, ఎంఐఎం ఎంపీ వైఎస్సార్‌ బాటలో సీఎం వైఎస్‌ జగన్‌ రిజర్వేషన్లతో ముస్లింల తలరాతలను మార్చిన దివంగత వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకాన్ని అమలు చేసి అన్ని వర్గాల పేదల ఆరోగ్యానికి భరోసా ఇచ్చారు. వైఎస్సార్‌ పేరు చెబితే ముస్లింలకు రిజర్వేషన్లు, పేదలకు ఆరోగ్య శ్రీ గుర్తుకొస్తాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన తండ్రి కంటే రెండడుగులు ముందుకేసి వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చేశారు. ముస్లిం రిజర్వేషన్లు కొనసాగించిన సీఎం వైఎస్‌ జగన్‌ నాడు–నేడు ద్వారా ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీలను ఆధునికీకరణ చేసి అన్ని మౌలిక సదు­పా­యాలను కల్పించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్‌ జగన్‌ వైద్య రంగంలో సుమారు 50 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయగా, వాటిలో ఐదు కాలేజీలను ప్రారం­భించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఫ్యామిలీ డాక్టర్, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ విలేజ్, అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లను ప్రారంభించారు. రాష్ట్రంలోని 92 శాతం మంది ప్రజలకు ఆరో­గ్యశ్రీ ద్వారా చికిత్స పొందే వెసులుబాటు కల్పిం­చిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారు. –మహబూబ్‌ షేక్, వైద్య నిపుణుడు, విజయవాడ ముస్లిం రిజర్వేషన్లు మతపరమైనవి కావు ఆర్థికంగా, సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన ముస్లింలను గుర్తించి 2004లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి రిజర్వేషన్లు కల్పించారు. 2004 ఎన్నికల్లో తానూ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అధికారం చేపట్టిన వైఎస్సార్‌ రిజర్వేషన్లు కల్పిస్తే వాటిని అడ్డుకునేందుకు చంద్రబాబు కోర్టులో కేసులు వేయించారు. 4 శాతం రిజర్వేషన్ల వల్ల ముస్లిం యువతకు ఉన్నత విద్యావకాశాలు దక్కుతున్నాయి. ఎంతోమంది ముస్లిం యువత ఇప్పుడు బాగా చదువుకుని ఉన్నతంగా జీవిస్తున్నారు. రిజర్వేషన్లు ముస్లిం సమాజంలో గొప్ప సానుకూల మార్పును తెచ్చాయి. –షేక్‌ మునీర్‌ అహ్మద్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వినర్‌

Tv Actor Chandu Hanged Herself at Home in Hyderabad
బుల్లితెర నటి కేసులో ట్విస్ట్‌.. ప్రియుడు సూసైడ్!

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. చందు ప్రస్తుతం త్రినయిని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం లాంటి సీరియల్స్‌లో నటించారు. కాగా.. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.కాగా.. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పవిత్ర పుట్టినరోజు సందర్భంగా తనను రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని వెల్లడించారు. కాగా.. పవిత్రతో సహజీవనం చేసిన చందు ఆమెను గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో చందు సూసైడ్‌ చేసుకోవడం ఒక్కసారిగా టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనతో సీరియల్ నటి పవిత్ర జయరాం ఆక్సిడెంట్ కేసు కీలక మలుపులు తిరగనుంది.

Today is a crucial battle between Chennai and Bangalore
చివరి బెర్త్‌ ఎవరిదో?

బెంగళూరు: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌... మూడుసార్లు రన్నరప్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్లు ‘ప్లే ఆఫ్స్‌’ దశకు అర్హత సాధిస్తాయా లేక లీగ్‌ దశలోనే నిష్క్రమిస్తాయా ఈరోజే తేలిపోనుంది. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్‌ రాయల్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు ‘ప్లే ఆఫ్స్‌’కు అర్హత పొందగా... చివరిదైన నాలుగో బెర్త్‌ కోసం చెన్నై, బెంగళూరు జట్లు ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం చెన్నై 14 పాయింట్లతో నాలుగో స్థానంలో... బెంగళూరు 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాయి. » చెన్నైపై బెంగళూరు గెలిస్తే... చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్లు 14 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలుస్తాయి. ఈ నేపథ్యంలో మెరుగైన రన్‌రేట్‌ ఉన్న జట్టుకే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారవుతుంది. » బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్ల కంటే చెన్నై రన్‌రేట్‌ మెరుగ్గా ఉంది. చెన్నైపై గెలవడంతోపాటు ఆ జట్టు రన్‌రేట్‌ను అధిగమించాలంటే బెంగళూరు 18 పరుగుల తేడాతో చెన్నైను ఓడించాలి. ఒకవేళ చెన్నై లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఆ లక్ష్యాన్ని బెంగళూరు 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించాలి. అయితేనే బెంగళూరుకు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ లభిస్తుంది. » మరోవైపు చెన్నై విజయం సాధించినా లేదా వర్షం వల్ల మ్యాచ్‌ రద్దయినా ఆ జట్టు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను దక్కించుకుంటుంది. »స్థానిక వాతావరణ శాఖ ప్రకారం శనివారం బెంగళూరు నగరానికి భారీ వర్ష సూచన ఉండటం గమనార్హం. ఫలితంగా బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఆ జట్టు ప్రదర్శనపైనే కాకుండా వరుణ దేవుడి దయపై కూడా ఆధారపడి ఉన్నాయి.

Decision on loan waiver may 18th: Telangana
రుణమాఫీపై నేడు నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అంబేడ్కర్‌ సచివాలయంలో జరగనుంది. లోక్‌ స భ ఎన్నికల అనంతరం జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి నిధుల సమీకరణ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకా శం ఉంది. ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణాల ను మాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలోనే నిధుల సమీకరణ, రుణమాఫీ కటాఫ్‌ తేదీలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండు లక్షల రూపాయల వర కు పంట రుణాలు తీసుకున్న వారి రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఒక నిర్ణయం తీసు కుని.. నిధులు సమకూర్చే బాధ్యతను అధికార యంత్రాంగంపై పెట్టే అవకాశం ఉంది.ధాన్యం కొనుగోళ్లపై చర్చప్రస్తుతం కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించడంతోపాటు, వచ్చే ఖరీఫ్‌ పంటల ప్రణాళికపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించిన పెండింగ్‌ అంశాలు, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కూడా చర్చించనున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపునకు ఉన్న అవకాశాలపై చర్చించే అవకాశం ఉంది. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల (కాళేశ్వరం) రిపేర్లకు సంబంధించి నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది.ఇందులోని సిఫారసులు పరిశీలించి తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై కేబినెట్‌లో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్‌ నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభమవుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌ల పంపిణీ తదితర అంశాలను చర్చించి విద్యాశాఖ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం.

Appireddy comments over Chandrababu and Purandeshwari
వదినా మరుదుల కుట్ర ఫలితమే విధ్వంసం

సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ముందెన్న­డూ ఎరుగని రీతిలో ఈసారి సార్వత్రిక ఎన్ని­కల్లో దాడులు, అల్లర్లు జరి­గాయి, ఇంకా కొనసాగు­తూనే ఉన్నాయి, ఇందుకు కారణాల్ని పరిశీలిస్తే.. ఈ దాడుల వెనుక చంద్రబాబు, ఆయన వదిన పురందేశ్వరి ధ్వంసరచన కుట్రే కనిపిస్తోందని’.. వైఎస్సార్‌­సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి విప్‌ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ రౌడీమూకలంతా రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య సూత్రాల్ని పక్కనబెట్టి యథేచ్ఛగా బరితెగించి దాడులకు దిగాయి. ఈ మూకలు అంతగా రౌడీయిజం చెలాయిస్తూ, వైఎస్సార్‌సీపీ కేడర్‌ను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలు చేస్తున్నా, పోలీసు­యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడా­న్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నాం.. చంద్రబాబు, పురందేశ్వరి కలిసి ఎన్నికల కమిషన్, పోలీసు యంత్రాంగం ద్వారా ఎన్ని­కల ప్రక్రియను అడ్డగోలుగా తమకు అనుకూలంగా చేసుకోవడానికి ప్రయత్నించారన్నది ఈసీ చర్యలతో రుజువైందని’.. అప్పిరెడ్డి వివరించారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల టార్గెట్‌గా జరిగిన పెత్తందార్ల దాడులివి. వదిన మరుదులు పురందేశ్వరి, చంద్రబాబుల ధ్వంసరచన కుట్రకు ఐఏఎస్, ఐపీఎస్‌లు బలయ్యారు. పోలీసులే పాత్రధారులుగా తాడిపత్రి, నరసరావుపేట దుర్ఘటనలు జరిగాయి. కేంద్ర పోలీసు పరిశీలకుడు దీపక్‌మిశ్రా కనుసన్న­ల్లోనే ఈ దాడులు జరిగాయి. మేం అధికారంలోకి రాగానే తప్పు­డు అధికారులపై చర్యలుంటాయి..’ అని అప్పి­రెడ్డి హెచ్చరించారు. ‘సీఎం జగన్‌ నాయకత్వమే మళ్లీ రావాలని పేదలు కోరుకున్నారని ఆ వర్గాన్నే టార్గెట్‌ చేసి దాడులు చేయడం భావ్యమేనా? ఇప్పటికైనా ఐఏ­ఎస్‌లు, ఐపీఎస్‌లు ప్రజాస్వామ్య విలువలకు కట్టు­బడి పనిచేయాలని కోరుతున్నాం. మేము అధికారంలోకి రాగానే విలువల్ని తుంగలో తొక్కి చంద్రబాబు ట్రాప్‌లో పడి, ఆయన కోసం పనిచే­సిన వారందరినీ లెక్కగట్టి శాఖాపరమైన విచారణకు పిలిపిస్తాం. ఆధారాలతో సహా రుజువు చేసి వారిపై చర్యలు తీవ్రంగా తీసుకుంటామని హెచ్చరి­స్తు­న్నాం..’ అని అప్పిరెడ్డి పేర్కొన్నారు.

Jaipur doctor conferred with Padma Shri for raising awareness on road safety training
డాక్టర్‌ రోడ్‌ సేఫ్టీ: మాయా టాండన్‌

ఉద్యోగ విరమణ తర్వాత చాలామంది విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలనే ఉద్దేశంతో ఇంటికే పరిమితం అవుతుంటారు. కానీ, జైపూర్‌ వాసి డాక్టర్‌ మాయా టాండన్‌ మాత్రం తన రిటైర్మెంట్‌ జీవితాన్ని రోడ్డు ప్రమాదాల్లో ్రపాణాలు కోల్పోతున్నవారిని కాపాడేందుకు అంకితం చేసింది. స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి లక్షా ముప్పై మూడు వేల మందికి రోడ్డు భద్రతకు సంబంధించిన శిక్షణ ఇచ్చింది. జీవితం పట్ల ఉత్సాహం, సమాజం కోసం పనిచేయాలనే తపనతో గత ముప్ఫై ఏళ్లుగా డాక్టర్‌ మాయా టాండన్‌ చేస్తున్న కృషికి గానూ ఆమెను ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం వరించింది. వైద్యసేవలోనే తరిస్తున్న టాండన్‌ గురించి ఆమె మాటల్లోనే...‘‘అజ్మీర్‌లో పుట్టి పెరిగాను. చిన్ననాటి నుంచి కుటుంబ మద్దతు నాకు ఎక్కువే ఉంది. అన్ని బోర్డ్‌ పరీక్షలలో మంచి మార్కులు సాధించి, అజ్మీర్‌లోని మెడికల్‌ స్కూల్‌లో చేరాను. జీవితమంతా నాదైన మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ నాకు లభించింది. అజ్మీర్‌లోని హాస్పిటల్‌లో వైద్యురాలిగా చేరాను. అక్కడే టాండన్‌తో జరిగిన పరిచయం పెళ్లికి దారితీసింది. పెళ్లి తర్వాత జైపూర్‌కు వెళ్లాను. కొడుకు పుట్టిన తర్వాత అనస్తీషియాలజీలో డి΄÷్లమా చేశాను. డి΄÷్లమా పూర్తయ్యేనాటికి కూతురు కూడా పుట్టింది. ఆ తర్వాత అనస్తీషియాలోనే ఎమ్మెస్‌ కూడా చేశాను. జైపూర్‌లోని మెడికల్‌ కాలేజీలో అనస్తీషియాపై స్పీచ్‌లు ఇచ్చేదాన్ని. అందులో భాగంగా పీడియాట్రిక్‌ అనస్తీషియా కోసం లండన్‌ ఫెలోషిప్‌కు హాజరయ్యాను. అక్కణ్ణుంచి వచ్చాక జైపూర్‌లో పనిచేయడం ్రపారంభించాను. మూడు రోజుల కోర్సు తిప్పిన మలుపుసాధారణంగా అందరికీ అనస్తీషియాలజిస్ట్‌ పాత్ర తెర వెనుక పనిగా కనిపిస్తుంది. నేను మాత్రం రోగి జీవితం అనస్తీషియాలజిస్ట్‌ పై ఆధారపడి ఉంటుందని నమ్ముతాను. 1975లో సవాయ్‌ మాన్‌సింగ్‌ హాస్పిటల్‌లో సూపరింటెండెంట్‌గా, అనస్తీషియా హెడ్‌గా పనిచేస్తూ దాని నిర్వహణను చూశాను. 1985లో పదవీ విరమణ చేసే సమయంలో జైపూర్‌లోని రాజస్థాన్‌ ΄ోలీసు అకాడమీ నన్ను సంప్రదించి, రోడ్డు భద్రత, ్రపాణాలను రక్షించడంపై మూడు రోజులు కోర్సు ఇవ్వాలని కోరింది. రిటైర్‌మెంట్‌ తర్వాత అదే నా జీవిత గమనాన్ని మలుపు తిప్పుతుందని తెలియకనే వారి అభ్యర్థనను అంగీకరించాను. మూడు రోజుల కోర్సు చాలా సక్సెస్‌ అయ్యింది. దీంతో జైపూర్, చుట్టుపక్కల హైవేలపై ΄ోస్ట్‌ చేసే సీనియర్‌ అధికారులందరి కోసం మరొక కోర్సు ఏర్పాటు చేశారు. ఒక ఫొటోగ్రాఫర్‌ ఆ ఈవెంట్‌ ఫొటోలు తీయడానికి వచ్చాడు. కొన్ని నెలల తర్వాత అతను నాకు ఫోన్‌ చేసి, నేను అతని ్రపాణాలను రక్షించానని చె΄్పాడు. అదెలా అని ఆశ్చర్య΄ోయాను. ఆ ఫొటోగ్రాఫర్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతని తొడల వెనక భాగంలో రక్తస్రావం అవుతూ ఉంది. అతని చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా సహాయం చేయాలో తెలియక ప్రమాదం తాలూకు ఫొటోలు తీసుకుంటున్నారు. తనను ఎత్తి, ఒక చోట ఎలా కూర్చోబెట్టాలో చెప్పి, రక్తస్రావం తగ్గేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సాటివారికి వివరించి, ప్రమాదం నుంచి బయటపడిన విధం గురించి తెలియజేశాడు. దీంతో ఆ కోర్సు ్రపాముఖ్యత ఎంతటిదో గ్రహించాను. సమయానుకూలంగా తీసుకునే జాగ్రత్తలు మన ్రపాణాలను ఎలా కాపాడతాయో ఆ రోజు మరింతగా కళ్లకు కట్టాయి. ఎక్కడైనా ప్రమాదం జరిగితే చుట్టూ అందరూ గుమికూడుతారు. ఆ గుంపులోని వ్యక్తులలో ఎవరికీ ్రపాణాలను రక్షించే దశలు తెలియవు. దీంతో భారతదేశంలో రహదారి భద్రత తీరుతెన్నులు మార్చాలనే ఉద్దేశ్యంతో ‘సహాయ’ ట్రస్ట్‌ను ్రపారంభించాను. అప్పటి నుండి 1,33,000 మంది వ్యక్తులకు ఉచిత కోర్సులు, సెమినార్లు, ఉపన్యాసాలు ఇస్తూ వచ్చాను.కోర్సులు అన్నీ ఉచితమేకార్డియోపల్మొనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌), ప్రమాదాలను ఎదుర్కోవడానికి సరైన నిర్వహణ పద్ధతులు, అవగాహన పెంచడం దీని లక్ష్యం. ΄ోలీసు విచారణ నుండి లైఫ్‌ సేవర్‌ను రక్షించే వివిధ చట్టాల గురించి కూడా కోర్సులో పాల్గొనేవారికి తెలియజేస్తాం. గాయపడిన వ్యక్తికి సిపీఆర్, ప్రథమ చికిత్స ఎలా అందించాలో మేం చూపిస్తాం. ప్రజలను చేరుకోవడానికి మాకు వివిధ మార్గాలు ఉన్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో సెమినార్లు ఇస్తాం. వర్క్‌షాప్‌లు, తరగతులను కూడా నిర్వహిస్తాం. అదనంగా ర్యాలీలు చేస్తాం. వీధి నాటకాలు కూడా వేయిస్తాం. ఒక చిన్న కోర్సులో మొదటి పది సెకన్లలో ఏమి చేయాలో వారికి సూచనలు అందించడానికి ్రపాధాన్యత ఇస్తాం. ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు తలకు గాయాలు, రక్తస్రావం కోసం తనిఖీ చేయమని చెబుతాం. సమస్య ఏమిటో నిర్థారించుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఊపిరి, గుండెకు సంబంధించిన సమస్య ఉంటే సీపీఆర్‌ని ఆశ్రయించడం ఉత్తమమైన మార్గం. అంతర్గత రక్తస్రావం, కార్డియాక్‌ అరెస్ట్‌ వంటి సమస్యలలో సీపీఆర్‌ మాత్రమే సహాయం చేస్తుంది. మాల్స్, విమానాశ్రయాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో అత్యవసర సేవలు ఉండేలా ప్రభుత్వ సంస్థలతో కలిసి ట్రస్ట్‌ పని చేస్తుంది.అవగాహన లోపమే ప్రధాన అడ్డంకివర్క్‌షాప్‌లకు హాజరయ్యేందుకు ప్రజలను తీసుకురావడం మేం ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకి. భారతీయ ప్రజానీకం ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు. కొంత సమయాన్ని అవగాహనకు కేటాయించాలనుకోరు. మా కోర్సులకు వచ్చి, విషయాల పట్ల అవగాహన పెంచుకోక΄ోవడంతో ఇంకా తక్కువ ప్రతిస్పందన రేటునే చూస్తున్నాం. రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం ముందుంది. ప్రతిస్పందనలో మాత్రం చాలా వెనుకుంది. దీంతో మన మూలాలైన గ్రామీణ ్రపాంతాలకు వెళ్లి, ప్రజలను రక్షించడానికి కావల్సిన శిక్షణ ఇవ్వాలని ΄్లాన్‌ చేస్తున్నాం. కోర్సులో పాల్గొన్న వ్యక్తులు స్వచ్ఛందంగా సేవ చేయడానికి లైఫ్‌సేవర్‌కి తగిన పరికరాలను ట్రస్ట్‌ అందిస్తుంది. హైవేలకు సమీపంలో నివసించే గ్రామస్థులకు శిక్షణ ఇవ్వడానికి అందరి నుంచి ఆర్థిక సాయం కూడా కోరుతుంటాను. ఎందుకంటే గాయపడిన వారిని చేరుకోవడానికి, మొదటగా స్పందించినవారికి.. విరాళం ఇవ్వడానికి కూడా మేము సహాయం చేస్తుంటాం’ అని వివరిస్తుంది ఈ డాక్టర్‌.

Lok Sabha Election 2024: 39percent candidates in 6th phase LS polls crorepatis says ADR Report
Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్‌ జిందాల్‌

లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థులందర్లో బీజేపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త నవీన్‌ జిందాల్‌ అత్యధిక ఆస్తులతో తొలి స్థానంలో ఉన్నారు. జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ కంపెనీ చైర్మన్‌ అయిన నవీన్‌ హరియాణాలోని కురుక్షేత్ర నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. తనకు రూ.1,241 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్లో వెల్లడించారు. మొత్తం 866 మంది అభ్యర్థుల్లో 39 శాతం మంది కోటీశ్వరులే. వీరికి సగటున రూ.6.21 కోట్ల ఆస్తి ఉన్నట్టు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌ ప్రకటించింది. ఆశ్చర్యకరంగా కురుక్షేత్రలో జిందాల్‌పై ఆప్‌ కూడా సంపన్న నేతనే పోటీకి దించింది. ఆ పార్టీ అభ్యర్థి సుశీల్‌కుమార్‌ గుప్తా రూ.169 కోట్ల ఆస్తులతో టాప్‌–3లో ఉన్నారు. ఒడిశాలో కటక్‌ బీజేడీ అభ్యర్థి సంతృప్త్‌ మిశ్రా రూ.482 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. తనవద్ద కేవలం రెండు రూపాయలే ఉన్నట్టు రోహ్‌తక్‌ లోక్‌సభ స్థానంలో స్వతంత్రుడిగా పోటీ చేస్తున్న రణ«దీర్‌ సింగ్‌ పేర్కొన్నారు! 180 మందిపై క్రిమినల్‌ కేసులు ఆరో విడతలో 180 మంది (21 శాతం) అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్టు ఏడీఆర్‌ వెల్లడించింది. వీరిలో 141 మందిపై సీరియస్‌ కేసులున్నాయి. 12 మంది తమను దోషులుగా కోర్టు ప్రకటించినట్టు పేర్కొనగా, పలువురు హత్య కేసుల్లోనూ అభియోగాలు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు. 21 మందిపై హత్యాయత్నం కేసులున్నాయి. 24 మంది మహిళలకు సంబంధించిన కేసుల్లో నిందితులు. ముగ్గురిపై అత్యాచారం కేసులున్నాయి. ఆప్‌ తరఫున పోటీలో ఉన్న ఐదుగురు, ఆర్జేడీ అభ్యర్థులు నలుగురూ క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. ఎస్పీ అభ్యర్థుల్లో 75 శాతం, బీజేపీ అభ్యర్థుల్లో 55 శాతం మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. ఆర్జేడీకి చెందిన నలుగురూ, ఆప్‌నకు చెందిన నలుగురు (80 శాతం), ఎస్పీ నుంచి 12 మంది (75 శాతం) బీజేడీ నుంచి 18 మంది (35 శాతం)పై సీరియస్‌ క్రిమినల్‌ కేసులున్నాయి. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement