అనిల్‌ అంబానీపై మరో పిడుగు

Chinese Banks Demand $2.1 Billion From Embattled Anil Amban  Firm - Sakshi

రుణాలు తీర్చమని డిమాండ్‌ చేసిన చైనా బ్యాంకులు 

కనీసం 2.1 బిలియన్ల డాలర్లు  చెల్లించండి!

సాక్షి, ముంబై : అప్పులు, దివాలా ఊబిలో కూరుకుపోయి అస్తులను అమ్ముకుంటున్న పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి మరో భారీ షాక్‌ తగిలింది. చైనాకు చెందిన పలు బ్యాంకులు ఆర్‌కాం  బకాయిలకు సంబంధించి కనీసం  2.1 బిలియన్‌ డాలర్లు అప్పు కట్టాల్సిందేనని డిమాండ్‌ చేశాయి.  ఇప్పటికే భారీగాసంపదను కోల్పోయి ప్రపంచ బిలియనీర్ల జాబితాలోంచి కిందికి పడిపోయిన అనిల్‌ అంబానీ నెత్తిన మరో పిడుగు పడినట్టైంది. 

చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాలు  అనిల్ అంబానీ కంపెనీకు పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చాయి అప్పులు ఇచ్చాయి. ప్రస్తుతం   ఇవి అప్పులను రాబట్టేందుకు సిద్ధమయ్యాయి.  జూన్‌ 13 నాటికి  ఏడు టాప్‌ బ్యాంకులకు కంపెనీలు చెల్లించాల్సిన రుణాల వివరాలు ఇలా ఉన్నాయి.  చైనా ప్రభుత్వరంగ బ్యాంకు  చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్.. రూ.9,860 కోట్ల (1.4 బిలియన్ డాలర్లు). ఎగ్జిమ్ బ్యాంక్ ఆప్ చైనా రూ.3,360 కోట్లు, కమర్షియల్ బ్యాంక్ ఆప్ చైనా రూ.1,554 కోట్లుగా ఉంది.  దీనికితోడు  దేశీయంగా  స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా రూ. 4910 కోట్లు, బ్యాంకు ఆఫ్‌ బరోడా రూ. 2 700 కోట్లు, యాక్సిస్‌ బ్యాంకు రూ. 2090 కోట్లు  మాడిసన్‌ పసిఫిక్‌ ట్రస్ట్‌కు రూ.2350 కోట్లు బకాయి ఉంది. ఈ మొత్తం అప్పులు రూ.57,382 కోట్లుగా ఉంది. ఇది కాకుండా రష్యాకు చెందిన బీటీబీ కేపిటల్ ఆఫ్ రష్యాకు రూ.511 కోట్లు,  స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ (లండన్), డాయిష్ బ్యాంక్ (హాంగ్‌కాంగ్) డీబీఎస్ బ్యాంక్, ఎమిరేట్స్ ఎన్‌బీడీ బ్యాంక్‌లతో పాటు ఇతరులకు బకాయిలు పేరుకుపోయాయి. రుణాలకు సంబంధించిన వివరాలను రిలయన్స్ కమ్యూనికేషన్స్ సోమవారం  విడుదల చేసింది. 

 కాగా ఆర్‌కామ్‌, ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో మధ్య రూ.17,300 కోట్ల కొనుగోలు ఒప్పందానికి సిద్ధమయ్యాయి.  కానీ రెగ్యులేటరీ సమస్యల కారణంగా ఈ డీల్‌కు బ్రేక్‌పడింది. ఇది ఇలా వుంటే ఆస్తులు అమ్మి అయినా మొత్తం అప్పులు తీర్చేస్తామని ఇటీవల   అనిల్‌ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top