త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ వాలెట్ సేవలు.. | BSNL aims to launch m-wallet with SBI over next 2 months | Sakshi
Sakshi News home page

త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ వాలెట్ సేవలు..

Jun 17 2015 12:38 AM | Updated on Sep 3 2017 3:50 AM

త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ వాలెట్ సేవలు..

త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ వాలెట్ సేవలు..

ఎస్‌బీఐతో కలిసి... బీఎస్‌ఎన్‌ఎల్.. మరో రెండు నెలల్లో మొబైల్ వాలెట్ సర్వీసులను ప్రారంభించనుంది...

కోల్‌కతా: ఎస్‌బీఐతో కలిసి... బీఎస్‌ఎన్‌ఎల్.. మరో రెండు నెలల్లో మొబైల్ వాలెట్ సర్వీసులను ప్రారంభించనుంది. తమ మొబైల్ వాలెట్ సేవలు ఇతర సంస్థల సేవలకు భిన్నమైనవని, ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి డబ్బులను డ్రా చేసుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్ పేర్కొంది. అయితే ఎస్‌బీఐ ఖాతా, ఎలాంటి ఏటీఎం కార్డ్ లేకుండా డబ్బుల్ని డ్రా చేసుకునే సాంకేతికతను రూపొందిస్తున్నామని బీఎస్‌ఎన్‌ఎల్ సీజీఎం (కోల్‌కతా టెలిఫోన్స్) అమిత్ భట్టాచార్య తెలిపారు. మొబైల్ వాలెట్ ద్వారా సినిమా టికెట్ల బుకింగ్, ప్రీపెయిడ్ కార్డ్స్ రీచార్జ్, ఆన్‌లైన్ షాపింగ్, యుటిలిటీ బిల్లులను చెల్లించవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్ అతి త్వరలోనే ‘బీఎస్‌ఎన్‌ఎల్ బిజ్’ అనే సర్వీసులను ప్రారంభించనుందని సీనియర్ జీఎం బిశ్వజిత్ పాల్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement