బిగ్ సిలో ఐఫోన్ 6పై ఆఫర్లు | Big C offers on the iPhone 6 | Sakshi
Sakshi News home page

బిగ్ సిలో ఐఫోన్ 6పై ఆఫర్లు

Oct 11 2014 1:37 AM | Updated on Sep 2 2017 2:38 PM

బిగ్ సిలో ఐఫోన్ 6పై ఆఫర్లు

బిగ్ సిలో ఐఫోన్ 6పై ఆఫర్లు

ప్రముఖ మొబైల్ రిటైల్ చెయిన్ సంస్థ, బిగ్ సి లో యాపిల్ ఐఫోన్, ఐఫోన్6లకు ముందస్తు బుకింగ్ జరుగుతోంది.

హైదరాబాద్: ప్రముఖ మొబైల్ రిటైల్ చెయిన్ సంస్థ, బిగ్ సి లో యాపిల్ ఐఫోన్, ఐఫోన్6లకు ముందస్తు బుకింగ్ జరుగుతోంది. తమ షోరూమ్‌ల్లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేసిన వారికి రూ.6,000 విలువ గల ప్రయోజనాలను అందించనున్నామని బిగ్ సి ఒక ప్రకటనలో తెలిపింది. బుకింగ్ చేసుకున్న వారికి ఈ నెల 17 నుంచి ఫోన్లను డెలివరీ చేస్తామని బిగ్ సి చైర్మన్ ఎం. బాలు చౌదరి పేర్కొన్నారు.

ఈ ఫోన్ కొనుగోళ్లపై రెండు సంవత్సరాల పాటు ఉండే వారంటీ, బీమా ఉచితంగా అందిస్తామని, వీటి విలువ రూ.6,000 వరకూ ఉంటుందని వివరించారు.. వినూత్నమైన ఆఫర్లను అందిస్తూ, వినియోగదారులను ఆకట్టుకోవడంలో తమది ప్రత్యేక స్థానమని, గతంలో తామందించిన అన్ని ఆఫర్లు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. తమ షోరూమ్‌ల్లో యాపిల్ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను కొనుగోలు చేసి రూ.6,000 విలువ చేసే ఉచిత ప్రయోజనాలను అందుకోవాలని ఆయన వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement