ఆధార్‌ తప్పనిసరి : ఆర్బీఐ | bank accounts and aadhar linking is mandatory | Sakshi
Sakshi News home page

ఆధార్‌ తప్పనిసరి : ఆర్బీఐ

Oct 21 2017 4:56 PM | Updated on Oct 21 2017 5:07 PM

bank accounts and aadhar linking is mandatory

సాక్షి, ముంబై : బ్యాంక్‌ ఖాతాలను ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి అని రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా శనివారం మరోమారు స్పష్టం చేసింది. చట్టవ్యతిరేక లావాదేవీలను నియంత్రించే క్రమంలో బ్యాంక్‌ ఖాతాను ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానం చేయాల్సిందేనని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆధార్‌ నెంబర్‌తో బ్యాంక్‌ ఖాతాలను అనుసంధానం చేయాల్సిన అవసరం లేదంటూ వస్తున్న కథనాలను ఆర్బీఐ తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం - 2017 ప్రకారం ఇది తప్పనిసరి అని ఆర్బీఐ పేర్కొంది. డిపెంబర్‌ 31 లోగా ప్రతి బ్యాంక్‌ ఖాతాదారుడు.. తన ఖాతాను ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానం చేసుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం - 2017ను అనుసరించి అన్ని బ్యాంకులు తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా.. అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement