పీఎం కేర్స్‌కు బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 10 కోట్లు | Bajaj Finserv And Coal India donates Rs 221 crore to PM Cares fund | Sakshi
Sakshi News home page

పీఎం కేర్స్‌కు బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 10 కోట్లు

Apr 25 2020 5:20 AM | Updated on Apr 25 2020 5:20 AM

Bajaj Finserv And Coal India donates Rs 221 crore to PM Cares fund - Sakshi

ముంబై: కరోనా వైరస్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎంకేర్స్‌ అనే ప్రత్యేక నిధికి బజాజ్‌ ఫిన్‌సర్వ్, ఆ సంస్థ ఉద్యోగులు సంయుక్తంగా రూ.10.15 కోట్ల విరాళాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి.  కరోనా వైరస్‌ నివారణకు రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు గతంలోనే బజాజ్‌ గ్రూపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఎంఆర్‌ఎఫ్‌ రూ.25 కోట్లు: ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్‌ఎఫ్‌ సైతం కరోనా వైరస్‌ నివారణ చర్యలకు మద్దతుగా రూ.25 కోట్లను ప్రకటించింది.

కోల్‌ ఇండియా రూ.221 కోట్లు: ప్రభుత్వరంగ సంస్థ కోల్‌ ఇండియా కరోనా వైరస్‌ నివారణ కోసం భూరీ విరాళాన్ని ప్రకటించింది. పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.221 కోట్లను అందించినట్టు తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement