ఎన్ఐఐఎఫ్ లో పెట్టుబడులు పెట్టండి | Arun Jaitley invites UAE to invest in NIIF | Sakshi
Sakshi News home page

ఎన్ఐఐఎఫ్ లో పెట్టుబడులు పెట్టండి

Feb 11 2016 1:46 AM | Updated on Sep 3 2017 5:22 PM

ఎన్ఐఐఎఫ్ లో పెట్టుబడులు పెట్టండి

ఎన్ఐఐఎఫ్ లో పెట్టుబడులు పెట్టండి

భారత్ తొలి సావరిన్ వెల్త్ ఫండ్- ఎన్‌ఐఐఎఫ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ యూఏఈకి విజ్ఞప్తి చేశారు.

యూఏఈకి జైట్లీ వినతి...
న్యూఢిల్లీ: భారత్ తొలి సావరిన్ వెల్త్ ఫండ్- ఎన్‌ఐఐఎఫ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ యూఏఈకి విజ్ఞప్తి చేశారు. యూఏఈ ఆర్థికమంత్రి సుల్తాన్ అల్ మన్‌సూరీ ఇక్కడ జరిగిన సమావేశం సందర్భంగా జైట్లీ ఈ విజ్ఞప్తి చేశారు. మౌలిక రంగ  ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఫండ్‌గా రూ.40,000 కోట్ల ఎన్‌ఐఐఎఫ్ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభుత్వ వాటా 49 శాతం వాటా కాగా మిగిలిన వాటా ప్రైవేటు ఇన్వెస్టర్లుగా నిర్దేశించడం జరిగింది.  గల్ఫ్ ప్రాంతంలో ఇన్వెస్టర్ల నుంచి భారత్ మౌలిక ప్రాజెక్టుల్లో పెట్టుబడులను తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. వివిధ రంగాల్లో సన్నిహిత సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని ఇరువురు నాయకులూ నిర్ణయించినట్లు ఆర్థికశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement