ఆపిల్‌ హోమ్‌పాడ్‌ వచ్చేస్తోంది | Apple to sell delayed HomePod | Sakshi
Sakshi News home page

ఆపిల్‌ హోమ్‌పాడ్‌ వచ్చేస్తోంది

Jan 26 2018 5:10 PM | Updated on Aug 20 2018 2:55 PM

Apple to sell delayed HomePod - Sakshi

ఎట్టకేలకు అమెజాన్‌ ఎకోకు, గూగుల్‌ హోమ్‌కు పోటీగా ఆపిల్‌ తన హోమ్‌పాడ్‌ను రంగంలోకి దించుతోంది. ఫిబ్రవరి 9న 349 డాలర్లకు(రూ.22,175) తమ హోమ్‌పాడ్‌ స్పీకర్‌ను లాంచ్‌ చేయనున్నట్టు ఆపిల్‌ ప్రకటించింది. ఈ డివైజ్‌ ప్రీ-ఆర్డర్లు నేటి(శుక్రవారం) నుంచి అందుబాటులోకి రానున్నట్టు తెలిపింది. అమెజాన్‌ ఎకో తరహాలో హోమ్‌పాడ్‌ను తీసుకురావాలని ఆపిల్‌ చాలారోజుల నుంచి సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. జూన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో, డిసెంబరులో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది కూడా. అయితే ఎంతో ముఖ్యమైన ఆ షాపింగ్‌ సీజన్‌ను ఆపిల్‌ మిస్‌ చేసుకుంది. హోమ్‌పాడ్‌ విడుదల తేదీని వాయిదా వేసింది. 

ఫ్యాబ్రిక్ మెష్‌తో తెలుపు, గ్రే రంగుల్లో అందంగా కనిపించే కంప్యూటర్ ప్రాసెసర్, స్మార్ట్‌ఫోన్‌తో పనిచేస్తుంది. వైర్‌లెస్‌ స్పీకర్‌ విషయంలో  ఇప్పటికే అమెజాన్‌ తన ఎకో డివైజ్‌తో ఆధిపత్యంలో ఉంది. ఆపిల్‌ హోమ్‌పాడ్‌తో వాయిస్‌ కమాండ్స్‌ ద్వారా పాటలు వినడం, గది ఉష్ణోగ్రతను అడ్జస్ట్‌ చేసుకోవడం లాంటివి చాలా పనులు చేయొచ్చు. హోమ్‌పాడ్‌ సిరి వాయిస్‌ అసిస్టెంట్‌ ఆధారంగానే పని చేస్తుంది. స్పీకర్‌ మార్కెట్‌ కూడా ఇటీవల కాలంలో గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది సుమారు 70 శాతం మంది స్మార్ట్‌ స్పీకర్‌ యూజర్లు ఎకోను వాడనున్నట్టు ఈమార్కెటర్‌ రీసెర్చ్‌ సంస్థ వెల్లడించింది. గూగుల్‌ హోమ్‌ 25 శాతం మంది వాడుతున్నట్టు పేర్కొంది. ఇప్పుడు వీటికి ఆపిల్‌ హోమ్‌పాడ్‌ పోటీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement