20 నుంచి అందుబాటులోకి ఈ కామర్స్‌ సేవలు

Amazon Flipkart To Now Sell Phones TVs Laptops More From April 20   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఈనెల 20 నుంచి ఈ కామర్స్‌ కంపెనీల సేవలు పూర్తిస్ధాయిలో అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి ఈ కామర్స్‌ సంస్థలు మొబైల్‌ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్స్‌, స్టేషనరీ వస్తువులు సహా పలు ఉత్పత్తుల విక్రయానికి అనుమతిస్తామని హోంమంత్రిత్వ శాఖ గురువారం స్పష్టం చేసింది. ఈ కామర్స్‌ సేవలకు అనుమతిస్తామని బుధవారమే హోం మంత్రిత్వ శాఖ వెల్లడించినా నిత్యావసర వస్తువులు, సేవల వరకే అనుమతిస్తారా అన్ని ఉత్పత్తుల విక్రయానికి అనుమతిస్తారా అనే స్పష్టత ఇవ్వలేదు.

ఆహారం, ఫార్మాస్యూటికల్స్‌, వైద్య పరికరాలు వంటి అత్యవసర వస్తువులనే విక్రయించాలని గత నోటిఫికేషన్స్‌లో హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక తాజా నిర్ణయంతో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్‌ కంపెనీల సేవలన్నీ ఏప్రిల్‌ 21 నుంచి దాదాపు పూర్తిస్ధాయిలో అందుబాటులోకి రానున్నాయి. 

చదవండి : కరోనా : అమెజాన్‌లో 75 వేల ఉద్యోగాలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top