అంతర్జాతీయ షాపింగ్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్‌నకు చెందిన ఆలీబాబా క్లౌడ్ దేశీయంగా డేటా సెంటర్లను ప్రారంభించనుంది.
	ముంబై: అంతర్జాతీయ షాపింగ్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్‌నకు చెందిన  ఆలీబాబా క్లౌడ్  దేశీయంగా డేటా సెంటర్లను ప్రారంభించనుంది. ప్రస్తుత   ఆర్థిక సంవత్సరంలో  భారత్ , ఇండోనేషియాలో  క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో   వీటిని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది.   భారత్‌లోని ముంబైలో రెండు,  ఇండోనేషియాలో జకార్తాలో  ఒక కొత్త డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు  ఆలీబాబా క్లౌడ్ ప్రకటించింది. భారతదేశం మరియు ఇండోనేషియాలో డేటా సెంటర్లను స్థాపించి ఈ ప్రాంతం మరియు ప్రపంచవ్యాప్తంగా మా స్థానం మరింత బలపడుతుందని అలీబాబా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలీబాబా క్లౌడ్ అధ్యక్షుడు సైమన్ హు చెప్పారు.
	
	మలేషియాలో ఇటీవలే ప్రకటించిన సమాచార కేంద్రంతో పాటు  ఆసియాలో ఆలీబాబా క్లౌడ్  సేవల్ని , కంప్యూటింగ్ వనరులను పెంచుకోనుంది. చిన్న మరియు మధ్యతరహా సంస్థలకు (ఎస్‌ఎంఈ) శక్తివంతమైన, స్కేలబుల్,  సరసమైన ధరలో, సమర్థవంతమైన , సురక్షిత క్లౌడ్ సామర్ధ్యాలతో  సేవల్ని అందించనున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
	
	దీంతో  మూడు కొత్త డేటా  కేంద్రాలతో అలీబాబా క్లౌడ్  మొత్తం డేటా సెంటర్ల సంఖ్య 17కి పెరిగనుంది. ముఖ‍్యంగా చైనా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, హాంకాంగ్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికాలో ఈ కేంద్రాలను నిర్వహిస్తోంది. కాగా ఆలీబాబా యాక్టివ్  యూజర్ బేస్దాదాపు 500 మిలియన్లుగా ఉంది.
కాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ అనుబంధ సంస్థ గ్లోబల్ క్లచ్ ఎక్స్ఛేంజ్ (జిసిఎక్స్) తో భాగస్వామ‍్యంతో ఆలీబాబా క్లౌడ్ పనిచేస్తోంది. జిసిఎక్స్ క్లౌడ్ ఎక్స్ ఫ్యూజన్ ద్వారా ప్రత్యక్షంగా వేల సంఖ్యలో భారతీయ వినియోగదారులకు సేవలను అందిస్తోంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
