ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌ : 1200జీబీ డేటా | Airtel Now Offers 300Mbps Broadband Plan At Rs. 2199 Per Month | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ కొత్త ప్లాన్‌ : 1200జీబీ డేటా

Apr 9 2018 1:04 PM | Updated on Apr 9 2018 1:06 PM

Airtel Now Offers 300Mbps Broadband Plan At Rs. 2199 Per Month - Sakshi

భారతీ ఎయిర్‌టెల్‌ (ఫైల్‌ ఫోటో)

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ తన తొలి 300ఎంబీపీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను సోమవారం ఆవిష్కరించింది. నెలవారీ రెంటల్‌ రూ.2199తో ఈ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చింది. ఫైబర్‌-టూ-ది-హోమ్‌(ఎఫ్‌టీటీహెచ్‌) సర్వీసు సబ్‌స్క్రైబర్లను టార్గెట్‌గా చేసుకుని ఈ ప్లాన్‌ను ఎయిర్‌టెల్‌ స్పెషల్‌గా రూపొందించింది. ఈ కొత్త ప్లాన్‌ కింద 1200జీబీ ఆల్ట్రా హై స్పీడు డేటాను అపరిమిత ఎస్టీడీ, లోకల్‌ కాలింగ్‌ ప్రయోజనాలను అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది.  

ఈ కొత్త 300ఎంబీపీఎస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను ఎంచుకునే ఎయిర్‌టెల్‌ సబ్‌స్క్రైబర్లకు, ఎయిర్‌టెల్‌ వింక్‌ మ్యూజిక్‌, ఎయిర్‌టెల్‌ టీవీ వంటి ఓటీటీ యాప్స్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ లభించనుంది. అంతేకాకుండా అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ను యూజర్లు పొందనున్నారు. ఈ ప్లాన్‌ డేటా రోల్‌అవుట్‌ ప్రయోజనాలను, ఎయిర్‌టెల్‌ సర్‌ప్రైజ్‌, మైహోమ్‌ రివార్డులను అందించనుంది. అంతేకాకుండా 1టీబీ బోనస్‌ డేటా కూడా అక్టోబర్‌ 31 వరకు యూజర్లకు అందుబాటులో ఉండనుంది. ఇది కేవలం ఈ ప్లాన్‌ను ఆన్‌లైన్‌ కొనుగోలు చేసే కస్టమర్లకు మాత్రమే.

ఎంపిక చేసిన సర్కిళ్లకు మాత్రమే ఈ ప్లాన్‌ను అందుబాటులో ఉంచుతున్నామని ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సైట్‌ను విజిట్‌ చేసి, సబ్‌స్క్రైబర్లు తమ సర్కిళ్లు ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోవాలని సూచించింది. హై స్పీడు డేటా ఆశించే వారికి ఈ కొత్త ఎఫ్‌టీటీహెచ్‌ ఆధారిత ప్లాన్లను ప్రవేశపెట్టడం చాలా ఆనందదాయకంగా ఉందని భారతీ ఎయిర్‌టెల్‌ సీఈవో జార్జ్‌ మతేన్ అన్నారు. వచ్చే రోజుల్లో ఎఫ్‌టీటీహెచ్‌ ఆఫర్స్‌ను మరింత పెంచుతామన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement