యూజర్లకు గుడ్‌న్యూస్‌ : జియోకు కౌంటర్‌

Airtel Allows Unlimited Use On Some Broadband Plans  - Sakshi

టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌, బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌లోనూ రిలయన్స్‌ జియోకు కౌంటర్‌ ఇస్తోంది. రిలయన్స్‌ జియో తన గిగాఫైబర్‌ బ్యాండ్‌ సర్వీసులను దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తున్న క్రమంలో, భారతీ ఎయిర్‌టెల్‌ తన హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొన్ని బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లపై అపరిమిత డేటాను వాడుకోవచ్చని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. దీని కోసం ఫేర్‌ యూసేజ్‌ పాలసీ డేటా పరిమితిని ఎయిర్‌టెల్‌ తొలగించేస్తున్నట్టు పేర్కొంది. 

20కి పైగా కీలక మార్కెట్లలో ఎంపిక చేసిన నెలవారీ హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్ ప్యాక్‌లపై ఉన్న ఫేస్‌ యూసేజ్‌ పాలసీ డేటా పరిమితిని తొలగిస్తున్నట్టు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. దీంతో కస్టమర్లకు అపరిమిత డేటా లభించనుంది. ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్‌కు మాత్రమే అపరిమిత హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేసేది. దీన్ని ఇతర మేజర్‌ మార్కెట్లకు కూడా విస్తరిస్తోంది. దీంతో తనకున్న 2.4 మిలియన్‌ యాక్టివ్‌ వైర్డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లను కాపాడుకోవాలని ఎయిర్‌టెల్‌ చూస్తోంది. 

గత నెలలో 300ఎంబీపీఎస్‌ వరకు స్పీడ్‌ ఉన్న హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లను ఎంపిక చేసుకున్న వారికి ఆరు నెలలు, ఏడాది పాటు 15 శాతం, 20 శాతం డిస్కౌంట్లను ఎయిర్‌టెల్‌ ఆఫర్‌చేసింది. ఎయిర్‌టెల్‌ అపరిమిత హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ డేటా ప్లాన్లను, కరెక్ట్‌గా జియో గిగాఫైబర్‌ సర్వీసులు మార్కెట్‌లోకి వచ్చే సమయంలో ఆఫర్‌ చేస్తోంది. కాగ, ఆగస్టు 15 నుంచే రిలయన్స్‌ జియో తన అప్‌కమింగ్‌ గిగాఫైబర్‌ బ్యాండ్‌ సర్వీసుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. కేవలం రూ.500కే హై-స్పీడ్‌, వైర్డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను ఇంటర్నెట్‌ ఆధారిత టెలివిజన్‌ ప్రొగ్రామింగ్‌ ఆధారితంగా అందిస్తోంది.

అపరిమిత ప్యాక్‌లుగా మారబోతున్న ఎయిర్‌టెల్‌ డేటా ప్లాన్లు...

  • ముంబైలో 699 రూపాయలు, 1,999 రూపాయల ప్లాన్లు
  • అహ్మదాబాద్‌, గాంధీనగర్‌, జమ్నాగర్‌లో 499 రూపాయలు, 599 రూపాయలు, 1,099 రూపాయల ప్లాన్లు
  • చంఢీఘర్‌, ఢిల్లీ, గుర్గావ్‌, నోయిడా, ఘజియాబాద్‌, జైపూర్‌, ఇండోర్‌, కోల్‌కత్తాల్లో 1,999 ప్లాన్‌
  • ఆగ్రా, అంబాలా, కర్నల్‌ల్లో 499 రూపాయలు, 1,999 రూపాయల ప్లాన్లు

‘ఎయిర్‌టెల్‌ మొత్తం హోమ్‌ బ్రాండ్‌ నెట్‌వర్క్‌ ప్రస్తుతం వి-ఫైబర్‌ ఆఫర్‌ చేస్తుంది. దీని కింద 300 ఎంబీపీఎస్‌ స్పీడులో డేటా లభ్యవుతుంది. ఒకవేళ కస్టమర్లకు అవసరమైతే, 1 జీబీపీఎస్‌ స్పీడుకు అప్‌గ్రేడ్‌ చేస్తాం’ అని ఎయిర్‌టెల్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. ప్రస్తుతం 89 ప్రాంతాల్లో ఉన్న బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను కనీసం 100 కీ నగరాలకు విస్తరించేందుకు ఆర్థిక సంవత్సరం 2019 కోసం రూ.24వేల కోట్లను పక్కన తీసి పెట్టినట్టు మరో సీనియర్‌ ఎయిర్‌టెల్‌ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. 2021 వరకు మరో 10 మిలియన్‌ పైగా గృహాలకు తమ నెట్‌వర్క్‌ను కనెక్ట్‌ చేయాలని ఎయిర్‌టెల్‌ లక్ష్యంగా పెట్టుకుంది.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top