ఎయిర్ ఇండియాకు ఇక పీఆర్ సేవలు | Air India to hire PR firm for image make-over | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఇండియాకు ఇక పీఆర్ సేవలు

Mar 7 2015 1:03 AM | Updated on Sep 2 2017 10:24 PM

ఎయిర్ ఇండియాకు ఇక పీఆర్ సేవలు

ఎయిర్ ఇండియాకు ఇక పీఆర్ సేవలు

వినియోగదారుల విశ్వాసాన్ని తిరిగి పొందడం ద్వారా ఇమేజ్ పెంచుకోవడం లక్ష్యంగా ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, పబ్లిక్ రిలేషన్స్(పీఆర్) సంస్థను నియమించుకోనున్నది.

న్యూఢిల్లీ: వినియోగదారుల విశ్వాసాన్ని  తిరిగి పొందడం ద్వారా ఇమేజ్ పెంచుకోవడం లక్ష్యంగా ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, పబ్లిక్ రిలేషన్స్(పీఆర్) సంస్థను నియమించుకోనున్నది.  ఆసక్తి ఉన్న పీఆర్ సంస్థల నుంచి సాంకేతిక, కమర్షియల్ బిడ్‌లను ఎయిర్ ఇండియా ఇటీవల ఆహ్వానించింది. ఈ బిడ్‌ల దాఖలుకు ఈ నెల 30 చివరి తేదీ. విమాన సర్వీసుల్లో తరుచుగా జాప్యం జరుగుతుండడం, విమాన సర్వీసులను రద్దు చేయడం ద్వారా ఇమేజ్ దెబ్బతిన్నదని ఎయిర్ ఇండియా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

అందుకే పీఆర్ సంస్థను నియమించుకోవాలని నిర్ణయించామని వివరించారు. పీఆర్ ఏజెన్సీ నియామకం ద్వారా ఎయిర్ ఇండియా పట్ల ప్రజలు, మీడియా అభిప్రాయాన్ని మెరుగుపరచడం, ప్రజలతో, కార్పొరేట్‌లతో వ్యవహారాలను మరింత ప్రభావవంతంగా నిర్వహించుకోవడం లక్ష్యాలని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement