ఫెస్టివ్‌ బొనాంజా : ఎయిరిండియా కొత్త స్ట్రాటజీ

Air India to introduce Red-Eye flights   - Sakshi

ఎయిరిండియా ఫెస్టివ్‌ బొనాంజా

 తక్కువ రేటుకే టికెట్లు : అర్థరాత్రి విమానాలు

సాక్షి, న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకుని ప్రయివేటీకరణ ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా వినూత్న ప్రణాళికలను ప్రకటించింది.   నవంబరు 30 నుంచి  సాధారణ చార్జీల కంటే తక్కవ రేట్లలో దేశీయ  సర్వీసులను  ప్రకటించింది.  గోవా,  ఢిల్లీ, బెంగళూరు లాంటి  నగరాలకు కొత్త సర్వీసులను  ప్రారంభిస్తున్నామని శనివారం (అక్టోబర్ 27) ఎయిరిండియా వెల్లడించింది. వచ్చే నెల చివరి నాటికి  ఈ సర్వీసులను లాంచ్‌ చేస్తామని తెలిపింది.భారీ ట్రాఫిక్‌ను ఛేదించండి...హోటల్‌  ఖర్చుల భారం నుంచి బయటపడండి.. నమ్మనలేని తక్కువ ధరల్లో విమాన టికెట్లను  ఆస్వాదించండి అంటూ  ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

ఢిల్లీ-గోవా-ఢిల్లీ, ఢిల్లీ-కోయంబత్తూర్-ఢిల్లీ, బెంగుళూరు-అహ్మదాబాద్-బెంగుళూరులాంటి మార్గాల్లో సాధారణ విమాన ఛార్జీల కంటే తక్కువ రేట్లకే అందిస్తామని  ప్రవేశపెడతామని ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా లేట్‌నైట్‌ బయలుదేరిన విమానాలు తెల్లవారేసరికి ఆయా గమ్యస్థానాలకు చేరేలా ఈ సర్వీసులను పరిచయం చేస్తున్నట్టు తెలిపింది.  రెడ్‌ఐ  విమానాలు విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, యూరప్‌లో బాగా ప్రాచుర్యం పొందాయని, ఈ నేపథ్యంలో ఈ సర్వీసులను దేశీయంగా కూడా పరిచయం చేస్తున్నట్టు పేర్కొంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top